Monday, March 27, 2023
- Advertisment -
HomeEntertainmentSundeep Kishan | రెజీనాతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్

Sundeep Kishan | రెజీనాతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్

Sundeep Kishan | యంగ్ హీరో సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ఇద్దరూ ప్రేమలో ఉన్నారని టాలీవుడ్‌లో కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్ల ప్రేమపై చాలా రోజులుగా పుకార్లు వచ్చినప్పటికీ.. తాజాగా ఈ వార్తలు మళ్లీ ఎక్కువయ్యాయి. దీనికి కారణంగా డిసెంబర్ 13న రెజీనా బర్త్ డే సందర్బంగా సందీప్ కిషన్ విష్ చేయడమే. హ్యాపీ బర్త్ డే పాప.. లవ్ యూ నీకు అంతా మంచే జరగాలి. స్టే బ్లెస్‌డ్ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే ఆమెతో క్లోజ్ ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని అంతా కన్ఫార్మ్ చేసుకున్నారు.

అప్పట్నుంచి రెజీనా, సందీప్ కిషన్ ప్రేమ వ్యవహారంపై తరచూ వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ వదంతులు ఎక్కువ కావడంతో యంగ్ హీరో సందీప్ కిషన్ స్పందించాడు. పన్నెండేళ్లుగా రెజీనా తెలుసని.. మేమిద్దరం కలిసి నాలుగు సినిమాలు చేశాం.. తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ సందీప్ కిషన్ చెప్పాడు. మేం ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పాడు. కానీ మేమిద్దరం ఫ్రెండ్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదు కదా.. మా మధ్య ఏదో ఉందంటే సర్‌ప్రైజ్ అవుతారంటూ సెటైర్ వేశాడు.

శివ మనసులో శృతి (ఎస్‌ఎంఎస్‌) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా సందీప్‌ కిషన్‌తో 4 సినిమాలు చేసింది. సందీప్ కిషన్‌తో కలిసి రొటీన్‌ లవ్‌ స్టోరీ, రారా కృష్ణయ్య, మానగరం, నక్షత్రం సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అప్పుప్పుడు కలుస్తుంటారు కూడా. ఈ క్రమంలోనే సందీప్‌ కిషన్‌తో రెజీనా డేటింగ్‌లో ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అవి మధ్యలో ఆగిపోయాయి. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌తో రెజీనా ప్రేమలో ఉందని వదంతులు వినిపించాయి. ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలపై అటు రెజీనా, ఇటు మెగా ఫ్యామిలీ ఎవరూ స్పందించలేదు. దీంతో ఈ వార్తలు పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు మళ్లీ సందీప్ కిషన్‌తో డేటింగ్‌లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సందీప్‌ కిషన్‌ చేసిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vani Jairam | టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ వాణీ జయరాం కన్నుమూత!

Vani Jairam | వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు…పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాతే ఓ క్లారిటీ!

Vani Jairam | వాణీ జయరాం కుటుంబ నేపథ్యం తెలుసా.. ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది!

Minister KTR | అవును మాది కుటుంబ పాలనే… ఆ కుటుంబానికి పెద్ద కేసీఆర్‌!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News