Saturday, April 20, 2024
- Advertisment -
HomeBusinessjackpot | లక్‌ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్...

jackpot | లక్‌ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్ పాట్!

jackpot | ఒక్కోసారి మనం చేసిన పనులు, కొన్న వస్తువుల సంగతి మర్చిపోతుంటాం. ఈ కెనడా అమ్మాయి కూడా తాను కొన్న లాటరీ టికెట్‌ గురించి మర్చిపోయింది. ఆ లాటరీ టికెట్ కూడా ఆమె సరదాగా కొంది. అది కూడా మొదటిసారి. కానీ లాటరీలో ఏకంగా 290 కోట్ల రూపాయల జాక్ పాట్‌‌ను ఆ యువతికి సొంతం చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెనడాలోని అంటారియోకు చెందిన జులియెట్‌ లామర్‌ కు ఈ భారీ లాటరీ వరించింది. లాటరీలో ప్రైజ్‌ మనీ గెలిచానన్న వార్త వినేంత వరకు తాను లాటరీ కొన్న సంగతి కూడా గుర్తు లేదని చెప్పింది. లాటరీలో గెలుపొందిన రూ.290 కోట్ల మనీని అంతా ఇన్వెస్ట్‌ చేస్తానని చెప్పుకొచ్చింది. జూలియట్‌ లామర్ కేవలం 18 సంవత్సరాలకే 48 మిలియన్‌ డాలర్ల భారీ లాటరీని గెలుచుకున్నట్లు అంటారియో లాటరీ అండ్‌ గేమింగ్ కార్పొరేషన్‌ ప్రకటించింది.

కెనడా లాటరీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్న అతి చిన్న వయసు ఉన్న యువతిగా లామర్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. సరదాగా మా తాత లాటరీ టిక్కెట్‌ కొనలాని సూచించినట్లు లామర్‌ తెలిపింది. నేను స్టోర్‌ కు వెళ్లిన సమయంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా టిక్కెట్‌ కొన్న అనుభవం లేకపోవడంతో అసలు ఏమి అడగాలో కూడా తనకు తెలియలేదని ఆమె వెల్లడించింది.

దీంతో నేను మా నాన్నకు ఫోన్ చేస్తే ఆయన లోట్టో 6-49 క్విక్‌ పిక్‌ కొనమని చెప్పారని తెలిపింది. నా మొదటి లాటరీ టికెట్‌కి ఇంత పెద్ద మొత్తం వస్తుందని అనుకోలేదని లామర్‌ తెలిపారు. ప్రస్తుతం చదువుకుంటున్నానని.. చదువు అయిన తరువాత ఏం చేయాలి అనే దాని మీద ఆలోచిస్తానని ఆమె వివరించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Cricket Australia | అశ్విన్‌ ‘డూప్‌’ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రాక్టీస్‌.. ఎందుకిలా ?

Income Tax | వేతన జీవులకు పాత పన్ను విధానం బెటరా.. కొత్త పన్ను విధానమా ?

Adani | అదానీ సంస్థలకు మరో షాక్.. అక్కడ నుంచి కూడా ఔట్!

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News