Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsMinister KTR | అవును మాది కుటుంబ పాలనే… ఆ కుటుంబానికి పెద్ద కేసీఆర్‌!

Minister KTR | అవును మాది కుటుంబ పాలనే… ఆ కుటుంబానికి పెద్ద కేసీఆర్‌!

Minister KTR | అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు సంధించిన ప్రశ్నలపై సుదీర్ఘంగా మాట్లాడారు మంత్రి కేటీఆర్‌. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ఇంత ప్రగతి సాధిస్తున్న తెలంగాణలో ప్రతిపక్ష నేతలకు అభివృద్ధి కనిపించకపోవడం శోచనీయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రతి కుటుంబంలోని అవ్వ, తాతలకు పెన్షన్ ఇస్తూ పెద్ద కొడుకై ఆదుకుంటున్నారని వివరించారు.

రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందిని తోబుట్టువుగా చూసుకుంటున్నారని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమంతో వృద్ధులకు కంటి చూపు, గురుకులాలు, కాలేజీలలో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న కేసీఆర్… ఒంటరి మహిళలకు ఫించన్ ఇస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నారని వివరించారు. సుమారు 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ తో ఆర్థిక సాయం అందించి కేసీఆర్ మేనమామ లెక్క అండగా ఉంటున్నారన్నారు.

అవును మాది ముమ్మాటికీ కుటుంబ పాలనే అని… కాకపోతే రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులేనన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ కుటుంబం మొత్తానికి పెద్ద అని చెప్పారు. అందుకే కుటుంబ పాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో వేటకుక్కలు తిరుగుతున్నాయి. అవి ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాయని సెటైర్లు వేశారు.

బీజేపీ నేత ఈటల రాజేందర్‌‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి… ఇటు పక్క ఉన్నప్పుడు మంచిగా ఉన్న ఈటల అటు పక్కకి పోగానే పూర్తిగా మారిపోయారన్నరారు. ఇక పోడు భూముల గురించి కానీ ఎవర్నైనా నిందించాలి అనుకుంటే మాత్రం మొదటగా మోదీ పనితీరు గురించే మాట్లాడాలి. 30 ఏళ్లలో అత్యంత ఎక్కువగా నిత్యావసర ధరలు పెరిగాయని వివరించారు. గడిచిన 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిందని.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన సిలిండర్ ధర ఇండియాలో ఉందని పేర్కొన్నారు. పెట్రోల్ ధర కూడా భారత్ లో ఎక్కువ అని విమర్శించారు కేటీఆర్.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

Kotamreddy Sridhar Reddy | నన్ను ఎన్‌కౌంటర్ చేస్తేనే నా గొంతు ఆగుతుంది.. జగన్‌కు నమ్మకద్రోహం చేసి ఉంటే.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vizag | రాజు ఎక్కడుంటే.. రాజధాని అక్కడే.. మూడు రాజధానులపై ఏపీ మంత్రి అమర్‌నాథ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

YS Jagan | విశాఖ నుంచే పరిపాలన.. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కన్ఫార్మ్ చేసిన ఏపీ సీఎం జగన్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News