Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentVani Jairam | వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు…పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాతే...

Vani Jairam | వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు…పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాతే ఓ క్లారిటీ!

Vani Jairam | ప్రముఖ గాయనీ వాణీ జయరాం మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాణీ జయరాం ఇంట్లో పని చేసే వ్యక్తి చెప్పిన వివరాల ఆధారంగా ఆమె మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆమె ఇంట్లో ఉన్న గ్లాస్ టేబుల్ మీద పడడంతో వాణీ జయరాం ముఖానికి బలంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. కాసేపటి తరువాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు… తలుపు కొట్టారు. అయినప్పటికీ ఎంత సేపటికీ ఆమె తలుపు తీయకపోవడంతో బద్దలు కొట్టి తలుపులు తెరిచారు.

అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్నారు వాణీ జయరాం. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్లాట్ లో అరగంట సేపు తనిఖీలు నిర్వహించారు పోలీసులు.

ఒమేదురార్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వాణీ జయరామ్‌ మృతదేహాన్ని తరలించారు. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చిన తరువాత ఆమె మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.

తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం , హిందీ, ఉర్దూ, మరాఠీ,బెంగాలీ, భోజ్‌పురి, తులు, ఒరియా భాషల్లో దాదాపుగా వాణీ జయరాం 10 వేలకు పైగా పాటలు పాడారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మ భూషణ్‌ తో కూడా సత్కరించింది.వాణీ మృతిపట్ల తెలుగు, తమిళ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

KTR with Eetela | మీరేందుకు రాలేదు..? మీరు పిలిస్తేనే కదా వచ్చేది.. కేటీఆర్‌, ఈటల మధ్య ఆసక్తికరమైన సంభాషణ

Vani Jayaram | టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ వాణీ జయరాం కన్నుమూత!

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News