Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentVani Jairam | వాణీ జయరాం కుటుంబ నేపథ్యం తెలుసా.. ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది!

Vani Jairam | వాణీ జయరాం కుటుంబ నేపథ్యం తెలుసా.. ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది!

Vani Jairam | ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) కన్ను మూశారు. వాణీ జయరాం అసలు పేరు కలైవాణి. ఆమె తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30 న జన్మించారు. తల్లిదండ్రులకు ఆమె ఐదవ సంతానం. ఎనిమిదవ ఏటనే సంగీత కచేరి నిర్వహించిన వాణీ జయరాం. ముత్తుస్వామి దీక్షితుల కీర్తనల ఆలాపనలో బాగా పాపులార్‌ అయ్యింది.

సాహిత్యంలోని మెళకువలను, పాటలోని భావాన్ని అలవోకగా ఒడిసిపట్టి ఆలపించడం వాణికే సొంతం. వాణీ జయరాం తల్లి ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్‌ శిష్యురాలు. ఆమె కర్నూలులో పుట్టి పెరగడం వల్ల వాణీ గారికి తెలుగు మీద మంచి పట్టు వచ్చింది. దానితో పాటు సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది.

ఆమె తన ఎనిమిదవ ఏటనే ఆలిండియా రేడియోలో పాట పాడి అందరినీ అబ్బుర పరిచిన బాలమేధావి. 1970లో గాయనిగా సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు,తమిళం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి మొత్తంగా 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె పాడారు. కర్ణాటక సంగీతాన్ని ఆమె ఔపోసన పట్టారు.

తన ఎనిమిదవ ఏటనే కచేరీలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. ముత్తు స్వామి దీక్షితార్ కీర్తనలు చక్కగా పాడేవారు. ఆమె దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గొప్ప నేపథ్య గాయనిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.

1969లో జయరామ్‌ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారు. తన విజయాల్లో అన్నింటిలోనూ తన భర్త ఉంటారని ఆమె ఎన్నో కార్యక్రమాల్లో వెల్లడించారు. వారికి పెళ్లైయి చాలాకాలం అయినప్పటికీ కూడా వారికి పిల్లలు లేరు.

జయరామ్‌ ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ఆమె చెన్నైలోని నుంగంబాకం లోని ఇంటిలో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె శనివారం ఉదయం మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమెది సహజ మరణం కాదని తెలుస్తోంది. ఆమె నుదురు తలపై ఎవరో బలంగా కొట్టినట్టు గాయాలున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vani Jairam | టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ వాణీ జయరాం కన్నుమూత!

Vani Jairam | వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు…పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాతే ఓ క్లారిటీ!

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News