Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsTransgender Pregnant | అబ్బాయిగా మారిన తర్వాత గర్బం దాల్చిన ట్రాన్స్‌జెండర్.. త్వరలోనే పండంటి బిడ్డకు...

Transgender Pregnant | అబ్బాయిగా మారిన తర్వాత గర్బం దాల్చిన ట్రాన్స్‌జెండర్.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మ

Transgender Pregnant | ఇండియాలో మొట్టమొదటి సారిగా ఓ ట్రాన్స్‌జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. మరో నెల రోజుల్లో వాళ్లు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్ కపుల్ జహాద్, జియా పావల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. అమ్మ కావాలనే తన కల.. నాన్న కావాలనే జహాద్ కోరిక త్వరలోనే నెరవేరబోతున్నాయంటూ జియా పావెల్ వెల్లడించింది.

గత మూడేళ్లుగా జహాద్, జియా పావల్ సహజీవనం చేస్తున్నారు. జియా పావెల్ పుట్టుకతో పురుషుడు.. లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా స్త్రీగా మారాడు. జహాద్ మహిళ.. కానీ పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గర్భాశయం సహా కొన్ని అవయవాలను ఇంకా తొలగించలేదు. ఇద్దరూ హార్మోన్ థెరపీ తీసుకుంటున్నారు. అయితే మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ తొలుత ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని భావించారు. అది కష్టమని తెలియడంతో తామే ఓ బిడ్డను కనడానికి ఏదైనా అవకాశం ఉందా? అని తెలుసుకున్నారు.

గర్భం ధరించేందుకు శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు లేవని కోజికోడ్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుల బృందం వెల్లడించడంతో జహాద్ బిడ్డకు జన్మనివ్వటానికి సిద్ధమయ్యాడు. దీనికోసం పురుషుడిగా మారే చికిత్సను జహాద్ వాయిదా వేసుకున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో అన్ని పరీక్షలు చేయించుకుని గర్భం దాల్చాడు. ఈ క్రమంలోనే అమ్మను కావాలనుకునే నా కల, నాన్న కావాలనుకునే తన కోరిక త్వరలోనే నెరవెరబోతోంది అంటూ అమ్మాయిలా మారిన 23 ఏళ్ల జియా పావెల్‌ ఇన్‌ స్టా వేదికగా వెల్లడించారు.

ఇలా గర్భం దాల్చే రోజు వస్తుందని తెలిస్తే తన బ్రెస్ట్‌ను తొలగించేవాడిని కాదంటూ జహాద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. బిడ్డ పుట్టిన తరువాత పాల కోసం ఈ జంట కోజికోడ్‌లోని రొమ్ము పాల బ్యాంకు సహాయం అందించాలని ఆశిస్తున్నారు. తమ కలల ప్రతిరూపానికి స్వాగతం పలకటానికి ఈ ట్రాన్స్‌జెండర్‌ జంట ఎంతో ఆశతో ఎదురు చూస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gay Couple | పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇండియన్ గే కపుల్

jackpot | లక్‌ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్ పాట్!

Anand Mahindra | హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నాడంటే

Breaking News | పండుగ నాడు ఉచిత చీరల పంపిణీ… తొక్కిసలాటలో నలుగురు మృతి!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News