Home Entertainment Thammareddy Bharadwaja | ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పను.. నన్ను అన్నందుకు మీరు...

Thammareddy Bharadwaja | ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పను.. నన్ను అన్నందుకు మీరు సిగ్గుపడాలి.. తమ్మారెడ్డి కౌంటర్స్‌

Image Source : Twitter

Thammareddy Bharadwaja | రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. భారతీయులే కాదు విదేశీయులు కూడా ఈ సినిమాను చూసి ఫిదా అయిపోతున్నారు. వరుసగా అవార్డులతో ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డుల బరిలోనూ ఈ చిత్రం నిలిచి భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచింది. ఈ సందర్భంగా అందరూ ప్రశంసిస్తుంటే.. తెలుగు నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం సినిమాపై విమర్శలు గుప్పించారు. ఆస్కార్‌ అవార్డుల కోసం ఖర్చు పెడుతున్న డబ్బులతో ఎన్నో చిన్న సినిమాలు తీయొచ్చని కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే తమ్మారెడ్డి వ్యాఖ్యలను నాగబాబు, కె.రాఘవేంద్రరావు ఖండించారు. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ మరోసారి స్పందించారు.

రెండున్నర గంటల పాటు జరిగిన సెమినార్‌ను వదిలేసి ఒక్క నిమిషం క్లిప్‌ను పట్టుకుని నిజానిజాలు తెలుసుకోకుండా దూషించడం సరికాదంటూ తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. నాగబాబు, రాఘవేంద్రరావులపై ఆయన విరుచుపడ్డారు. తనను దూషించడానికి సిగ్గు ఉండాలని మండిపడ్డారు. పెద్ద స్థాయిలో ఉన్న మీరు ఇంతగా సిగ్గులేకుండా సంస్కారం లేకుండా మాట్లాడతారా? అన్ని ప్రశ్నించారు.

`వీడికి లెక్కలు తెలుసా అంటున్నారు, ఆ లెక్కలు తెలియాల్సిన అవసరం లేదు. కానీ మీ అకౌంట్లన్నీ నాకు తెలుసు. మీరు అవార్డుల కోసం, పదవుల కోసం ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో నాకు తెలుసు. ఎవరెవరి చుట్టూ తిరిగారో తెలుసు. అవన్నీ బయటకు చెబితే ఇండస్ట్రీ పరువు పోతుంది.. నాకు అవి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీలాగా బూతులు మాట్లాడటం నాకూ వచ్చు. కానీ మా అమ్మానాన్న సంస్కారం నేర్చించారు, ఎలా మాట్లాడాలో నేర్పించారు, మీకు నేర్పించారా?’ అని మండి పడ్డారు. తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఏ తప్పు చేయలేదని, క్షమాపణలు చెప్పనని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. కానీ ఈ పెద్ద మనుషులు మట్లాడాక నాకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదనిపించిందన్నారు. తాను రాజమౌళిపై ఈర్ష్యతో ఈ వ్యాఖ్యలు చేశానని అంటున్నారని, కానీ తాను ఆయనకు సమకాలీకుడిని కాదు, అసలు ఇప్పుడు సినిమాలు చేయడంలేదు, ఆయనతో పోటీ ఎలా ఫీలవుతాను, రెండు రోజుల క్రితం రాజమౌళిని ప్రశంసిస్తూ పోస్ట్ చేశా, దాన్ని ఎవరూ ఎందుకు చూడలేదు, దానిపై ఎందుకు మాట్లాడటలేదని ప్రశ్నించారు.

‘ కొందరు నన్ను అసభ్యంగా, నీచంగా తిడుతున్నారు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం తెలుసు. ఎక్కడైనా నిజాలు మాట్లాడగలను. మీరు ధైర్యంగా నిజం చెప్పగలరా? నన్ను ఇంతగా తిడుతూ విమర్శిస్తున్న మీకు నన్ను అనే హక్కు ఉందా’ అని ప్రశ్నించారు. మీరు అనడం వల్ల నేను సెలబ్రిటీ అయ్యానని అంటున్నారు కానీ.. నా పేరుతో మీరు సెలబ్రిటీ కావాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నన్ను తిట్టేందుకు సిగ్గుండాలి. నేనేం సిగ్గుపడక్కర్లేదు. నేనేం తప్పు చేయలేదు. నేను నోరు విప్పితే చాలా విషయాలు బయటపడతాయి. విప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా ఒక్కటి. మనమంతా ఒక్కటి అని నేను ఫీలవుతాను. మీకు సిగ్గులేకపోతే, నాకు సిగ్గు, మానం, అభిమానం అన్నీ ఉన్నాయి అంటూ తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Exit mobile version