Monday, March 27, 2023
- Advertisment -
HomeEntertainmentTollywood | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నమూత

Tollywood | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నమూత

Tollywood | టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సాగర్ (70) కన్నుమూశాడు. చెన్నైలోని తన నివాసంలో అనారోగ్యంతో గురువారం ఉదయం 6 గంటల సమయంలో తుది శ్వాస విడిచాడు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద నిడమర్రులో 1952లో సాగర్ జన్మించాడు. ఈయన అసలు పేరు విద్యాసాగర్ రెడ్డి. 1983లో నరేశ్, విజయశాంతి హీరోహీరోయిన్లుగా వచ్చిన రాకాసి లోయ చిత్రంతో సాగర్ దర్శకుడిగా మారాడు. హీరోగా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ ముగిసినట్టే అని అనుకుంటున్న సమయంలో అమ్మదొంగ సినిమాతో హిట్ ఇచ్చాడు. స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, అన్వేషణ, అమ్మనా కొడలా సహా దాదాపు 30 చిత్రాలకు సాగర్ దర్శకత్వం వహించాడు. ఈయన దర్శకత్వం వహించిన రామసక్కనోడు చిత్రానికి మూడు నంది అవార్డులు వచ్చాయి. తెలుగు ఫిలిం అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఈయన సేవలు అందించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

SSMB28 | అమ్మో.. మహేశ్, త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?

Venu Madhav | వేణుమాధవ్ మరణానికి అసలు కారణం అదే.. సంచలన విషయం బయటపెట్టిన కమెడియన్‌ తల్లి సావిత్రమ్మ

Varun Tej | త్వరలోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. పెళ్లికూతురు ఆమేనా?

Nayanthara | నన్ను కూడా కమిట్‌మెంట్ అడిగారు.. సంచలన విషయం బయటపెట్టిన నయనతార

Jabardasth | జబర్దస్త్ నుంచి సింగర్ మనో ఎందుకు తప్పుకున్నాడు? కారణమేంటి?

Keerthy Suresh | మహానటి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. అసలు నిజమేనని చెప్పేసిన కీర్తి సురేశ్ తల్లి

Ileana | ఆస్పత్రి బెడ్‌పై ఇలియానా.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నానంటూ పోస్టు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News