Saturday, April 27, 2024
- Advertisment -
HomeEntertainmentNayanthara | నన్ను కూడా కమిట్‌మెంట్ అడిగారు.. సంచలన విషయం బయటపెట్టిన నయనతార

Nayanthara | నన్ను కూడా కమిట్‌మెంట్ అడిగారు.. సంచలన విషయం బయటపెట్టిన నయనతార

Nayanthara | సినిమాల్లో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ లేకుండా వస్తే ఆఫర్ల కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అమ్మాయిలు అయితే ఎన్నో వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తుంది. హీరోయిన్లుగా ఎదగాలంటే దర్శక నిర్మాతలకు కమిట్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గతంలో చాలామంది నటీమణులు చెప్పారు. హాలీవుడ్ నుంచి మొదలుపెడితే టాలీవుడ్ దాకా మీటూ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పారు. దీనిపై తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నోరు విప్పింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని స్పష్టం చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార.. తొలిసారిగా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా.. లేదా.. అంటే దానిపై మాట్లాడలేనని చెప్పింది. కాకపోతే తనను కూడా కమిట్‌మెంట్ అడిగారని బయటపెట్టింది. మన ప్రవర్తనను బట్టే మనకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనను కూడా కమిట్‌మెంట్ అడిగారని.. దానికి మొహం మీదనే నో చెప్పానని స్పష్టం చేసింది. కళారంగాన్ని, టాలెంట్‌ను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చానని.. అందుకే ఈ స్థాయికి వచ్చా.. ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాని నయన్ చెప్పుకొచ్చింది.

క్యాస్టింగ్ కౌచ్‌పై నయనతార చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు ఒక్కో రీతిలో స్పందిస్తున్నారు. నయన్ నిజంగానే టాలెంట్ నమ్ముకని వచ్చిందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. నయనతారను కమిట్‌మెంట్ అడిగే ధైర్యం చేసిందెవరు అంటూ ఆరా తీస్తున్నారు. కొంతమంది అయితే నయన్ కామెంట్స్‌ను తప్పుబడుతున్నారు. ఇండస్ట్రీలో ఎప్పుడో జరిగితే ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మీటూ ఉద్యమం జరిగినప్పుడు కూడా సైలెంట్‌గానే ఉంది కదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Keerthy Suresh | మహానటి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. అసలు నిజమేనని చెప్పేసిన కీర్తి సురేశ్ తల్లి

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News