Thursday, March 28, 2024
- Advertisment -
HomeLatest NewsSachin Tendulkar | సచిన్‌ చేతుల మీదుగా.. అండర్‌-19 జట్టుకు సన్మానం.. 5 కోట్ల చెక్‌...

Sachin Tendulkar | సచిన్‌ చేతుల మీదుగా.. అండర్‌-19 జట్టుకు సన్మానం.. 5 కోట్ల చెక్‌ అందజేత

Sachin Tendulkar | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే దుమ్మురేపి.. విశ్వవిజేతగా నిలిచిన భారత అండర్‌-19 మహిళల క్రికెట్‌ జట్టును మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అభినందించాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మెగాటోర్నీలో సత్తాచాటిన భారత్‌ ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. భారత మహిళల జట్టుకు ఏ స్థాయిలోనైనా ఇదే తొలి ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. సీనియర్‌ జట్టు వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి మూడుసార్లు ఫైనల్‌ చేరినా తుది మెట్టుపై బోల్తా పడగా.. ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు విజృంభించారు. ఆడిన తొలి మెగాటోర్నీలోనే విజేతగా నిలిచిన షఫాలీ వర్మ బృందాన్ని బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో సచిన్‌ అభినందించాడు. అమ్మాయిలు సాధించిన ఘనత చిరకాలం నిలిచిపోతుందని.. ముందుతరాల వారికి ఆదర్శంగా నిలుస్తుందని సచిన్‌ అన్నాడు.

5 కోట్ల నజరానా..

ప్రపంచకప్‌ నెగ్గిన అమ్మాయిల జట్టుకు బీసీసీఐ రూ. 5 కోట్ల జరిమానా ప్రకటించగా.. దానికి సంబంధించిన చెక్‌ను బోర్డు కార్యదర్శి జై షా బుధవారం కెప్టెన్‌ షఫాలీ వర్మకు అందించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానమైన అహ్మదాబాద్‌లో అమ్మాయిల విజయాన్ని వేడుకలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్‌ మాట్లాడుతూ.. ‘అద్వితీయమైన ఘనత సాధించిన జట్టుకు శుభాకాంక్షలు. మీ ప్రదర్శనతో యావత్‌ దేశం సంబురాలు జరుపుకుంటోంది. 1983 వన్డే ప్రపంచకప్‌ విజయం నాలో క్రికెట్‌పై ప్రేమ పెంచింది. అలాగే మీరిప్పుడు ఎందరో చిన్నారుల కలలకు బీజం వేశారు. అమ్మాయిలు దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే ఆకాంక్ష రగిల్చిన మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. మహిళల కోసం ప్రత్యేకంగా ‘వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌’ ప్రారంభం కానుండటం శుభపరిణామం. ఇది దేశంలో మహిళల క్రికెట్‌కు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. మెరుగైన భవిష్యత్తుకు ఇది నాంది వంటిది’ అని అన్నాడు.

బెంగాల్‌ ప్లేయర్లకు మరో నజరానా..

అనంతరం జట్టు సభ్యులకు జై షా చెక్‌ అందజేశాడు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌ మైదానం.. అభిమానుల కేరింతలతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, ట్రెజరర్‌ ఆశీశ్‌ కూడా పాల్గొన్నారు. మరోవైపు అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులోని సభ్యులైన ముగ్గురు పశ్చిమ బెంగాల్‌ ప్లేయర్లకు ఆ రాష్ట్ర బోర్డు నజరానా ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) వెల్లడించింది. ఇటీవలి కాలంలో భారత మహిళల జట్టు అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శనలు చేస్తుండగా.. ఈ విజయంతో మరింత బూస్ట్‌ అందినౖట్లెంది. ఇదే సమయంలో దేశంలో మహిళల ఐపీఎల్‌ ప్రారంభం కానుండటంతో ఇక అమ్మాయిల ఆటకు మరింత ఆదరణ దక్కడం పక్కా అనిపిస్తోంది. అండర్‌-19 స్థాయిలో రాణించిన అమ్మాయిల్లో ముగ్గురు, నలుగురు జాతీయ జట్టులోకి రావడం ఖాయమే అని దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ పేర్కొనగా.. అమ్మాయిల విజయం తమలో మరింత స్ఫూర్తి రగిల్చిందని భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rishab Pant | రిషబ్‌ పంత్‌ సర్జరీ సక్సెస్‌.. తొందరలోనే డిశ్చార్జి.. కానీ అదొక్కటే సమస్య

Novak Djokovic | జొకో జైత్రయాత్ర.. 22వ గ్రాండ్‌స్లామ్‌తో అగ్రస్థానానికి చేరిన సెర్బియా వీరుడు

India Vs New Zealand | ఉత్కంఠ పోరులో రెండో టీ20లో కివీస్‌పై భారత్ విజయం.. సిరీస్‌పై ఆశలు

India Vs New Zealand | రెండో టీ20లో చేతులెత్తేసిన న్యూజిలాండ్.. భారత్ విజయ లక్ష్యం 100 పరుగులే

Australian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News