Friday, March 31, 2023
- Advertisment -
HomeEntertainmentKeerthy Suresh | మహానటి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. అసలు నిజమేనని చెప్పేసిన కీర్తి...

Keerthy Suresh | మహానటి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. అసలు నిజమేనని చెప్పేసిన కీర్తి సురేశ్ తల్లి

Keerthy Suresh | సౌత్ ఇండస్ట్రీలో కీర్తి సురేశ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈమె పీకల్లోతు ప్రేమలో ఉన్నదని.. ప్రేమించిన వాడితో తొందరలోనే ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యిందని కొద్దిరోజులగా ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. పలు మీడియాల్లో వస్తున్న ఈ కథనాలపై కీర్తి సురేశ్ తల్లి, అలనాటి నటి మేనకా సురేశ్ క్లారిటీ ఇచ్చారు.

కీర్తి సురేశ్ ప్రేమలో ఉందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అతను ఎవరో కాదని.. కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ అని ముందుగా వార్తలు వచ్చాయి. భైరవ, ఏజెంట్ సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ లవ్‌లో పడిపోయారని.. అప్పట్నుంచి వీళ్లిద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం నడుపుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ ఎఫైర్ విషయం విజయ్ సతీమణి సంగీతకి తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని కూడా టాక్ నడిచింది. అందుకే ఆమెకు విడాకులు ఇచ్చి కీర్తి సురేశ్‌తో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో #JusticeForSangeetha హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో పెద్ద చర్చ జరిగింది. విజయ్ – సంగీత కాపురాన్ని కూలుస్తుందని కీర్తి సురేశ్‌పై నెటిజన్లు చాలా ట్రోల్స్ చేశారు. అంతకుముందు సింగర్ అనిరుధ్‌తో కూడా కీర్తి సురేశ్‌కు లింక్ పెట్టారు. కానీ అవన్నీ తప్పుడు కథనాలు అని తేలిపోయాయి.

తాజాగా కీర్తి సురేశ్ ప్రేమాయణం గురించి కొత్త వార్త పుట్టుకొచ్చింది. కీర్తి ప్రేమలో ఉన్న వ్యక్తి తన క్లాస్‌మేట్ అని ప్రచారం మొదలైంది. అతనితో 13 ఏళ్లుగా కీర్తి రిలేషన్‌లో ఉందని వార్తలు వచ్చాయి. కేరళకు చెందిన కీర్తి సురేశ్ ప్రియుడు ఓ బిజినెస్‌మ్యాన్ అని.. కేరళలో అతనికి రిసార్ట్స్ ఉన్నాయని కథనాలు వచ్చాయి. వీళ్ల ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలుసని.. త్వరలోనే వీళ్ల పెళ్లి చేయాలని నిర్ణయించినట్టుగా టాక్ నడిచింది. ఇలా కీర్తి సురేశ్‌పై రోజుకో వార్త రావడంతో ఆమె తల్లి మేనకా సురేశ్ స్పందించింది. తన కూతురుపై వస్తున్న ఆ వార్తలన్నీ అవాస్తవమేనని స్పష్టం చేసింది. తన కూతురు కీర్తి సురేశ్ తరఫున వాటన్నింటినీ ఖండిస్తున్నానని తెలిపింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News