Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentIleana | ఆస్పత్రి బెడ్‌పై ఇలియానా.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నానంటూ పోస్టు

Ileana | ఆస్పత్రి బెడ్‌పై ఇలియానా.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నానంటూ పోస్టు

Ileana | టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా అస్వస్థతకు గురైంది. కనీసం ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉండటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని గోవా బ్యూటీ ఇలియానానే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

ముందుగా ఆస్పత్రి బెడ్‌పై పడుకుని ఉన్న ఫొటోను ఇలియానా షేర్ చేసింది. తాను ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్నానని.. మూడు సెలైన్లు ఎక్కించారని రాసుకొచ్చింది. ఒక్క రోజులోనే ఎంత మార్పు వచ్చిందంటూ మరో ఫొటోను షేర్ చేసింది. చేతికి సెలైన్ ఎక్కించి ఉన్న ఫొటోలను చూసిన అభిమానులు కంగారు పడిపోయారు. ఫిట్‌గా ఉండే ఇలియానాకు అకస్మాత్తుగా ఏమైందంటూ ఆరా తీశారు. గెట్ వెల్ సూన్ అంటూ ఆమెకు మెసేజ్‌లు పెట్టారు. అభిమానులు పడుతున్న టెన్షన్ చూసిన ఇలియానా మరో ఫొటో షేర్ చేసి తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చింది.

నా ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధ చూపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నిజంగా నా కృతజ్ఞతలు. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. డాక్టర్లు బాగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. ఇలియానా తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ పోతినేని హీరోగా అరంగేట్రం చేసిన దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది గోవా బ్యూటీ ఇలియానా. మొదటి సినిమాకే మంచి పేరు రావడంతో రెండో సినిమాకే స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చింది. అలా పోకిరి కూడా హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, తమిళంలో బిజీ యాక్ట్రెస్‌గా మారిపోతున్న సమయంలో ఇక్కడి అవకాశాలను కాదంటూ బాలీవుడ్‌పై ఆశలు పెంచుకుంది. కానీ దక్షిణాదిలో దొరికినంత ఆదరణ ఇల్లూ బేబీకి నార్త్‌లో రాలేదు. దీంతో బాలీవుడ్‌లో మూడు నాలుగు సినిమాలకే పరిమితమైంది. బాలీవుడ్‌లో అవకాశాల కోసం ట్రై చేస్తూ టాలీవుడ్‌ను నెగ్లెక్ట్ చేయడం ఆమె కెరీర్‌కు పెద్ద మైనస్ అయ్యింది. దీంతో అటు బాలీవుడ్‌లో అవకాశాలు రావట్లేదు. గోవా బ్యూటీని హీరోయిన్‌గా తీసుకునేందుకు టాలీవుడ్ సిద్ధంగా లేదు. దీంతో అవకాశాలు లేక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ గడిపేస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News