Tuesday, April 16, 2024
- Advertisment -
HomeEntertainmentSSMB28 | అమ్మో.. మహేశ్, త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?

SSMB28 | అమ్మో.. మహేశ్, త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?

SSMB28 | టాలీవుడ్ లో కొన్ని కాంబోలకు ఎక్కడ లేని క్రేజ్ ఉంది. ఆ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబినేషనే త్రివిక్రమ్-మహేశ్ . వీరిద్దరూ కలయికలో గతంలో అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా పర్ ఫార్మ్ చేయలేకపోయినా.. స్మాల్ స్క్రీన్ పై మాత్రం అదరగొట్టాయి. ఎన్నో వందల సార్లు టెలికాస్టయిన సినిమాలే అయినా ఇప్పటికీ టీవీలో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం. అలాంటి ఈ కాంబినేషన్‌లో దాదాపు పుష్కరకాల సమయం తర్వాత మూడో సినిమా తెరకెక్కుతుంది. SSMB28 పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ను గతేడాదే అఫీషియల్ గా ప్రకటించినా.. పలు కారణాల వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ సారి మాత్రం లో ప్రొఫైల్ లోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

SSMB28 డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపు రూ.80 కోట్లు వెచ్చించిందట. కేవలం ఓటీటీ హక్కులకే ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ చేయడమంటే విశేషం అనే చెప్పాలి. అయితే నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పుకుని స్ట్రీమింగ్ చేసుకునే విధంగా మేకర్స్ తో డీల్ కుదరించుకుందట. ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు.. ఈ రేటుతో కాస్టింగ్ రెమ్యునరేషన్ పక్కన పెడితే, నిర్మాతలకు ప్రొడక్షన్ ఖర్చు దాదాపుగా వచ్చేసినట్లే.

ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. మహేశ్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nayanthara | నన్ను కూడా కమిట్‌మెంట్ అడిగారు.. సంచలన విషయం బయటపెట్టిన నయనతార

Jabardasth | జబర్దస్త్ నుంచి సింగర్ మనో ఎందుకు తప్పుకున్నాడు? కారణమేంటి?

Keerthy Suresh | మహానటి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. అసలు నిజమేనని చెప్పేసిన కీర్తి సురేశ్ తల్లి

Ileana | ఆస్పత్రి బెడ్‌పై ఇలియానా.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నానంటూ పోస్టు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News