Thursday, March 28, 2024
- Advertisment -
HomeEntertainmentJabardasth | జబర్దస్త్ నుంచి సింగర్ మనో ఎందుకు తప్పుకున్నాడు? కారణమేంటి?

Jabardasth | జబర్దస్త్ నుంచి సింగర్ మనో ఎందుకు తప్పుకున్నాడు? కారణమేంటి?

Jabardasth | జబర్దస్త్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది రోజా, నాగబాబు. పేరుకు వీళ్లిద్దరూ జడ్జిలే అయినప్పటికీ జబర్దస్త్ షో అంతగా సక్సెస్ కావడానికి మూలస్తంభాలుగా నిలిచారు. కమెడియన్స్‌ వేసే జోకులకు నవ్వడానికే పరిమితం కాకుండా.. స్కిట్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి పంచ్‌లు కూడా వేస్తూ తెలుగు వాళ్ల ఫేవరేట్‌ షోగా మార్చేశారు. జబర్దస్త్ సక్సెస్ కోసం కష్టపడ్డ వీళ్లిద్దరూ ఇప్పుడు షోలో లేరు. అభిప్రాయబేధాలతో ముందు నాగబాబు వెళ్లిపోతే.. రాజకీయాల్లో బిజీ కావడంతో రోజా కూడా వెళ్లిపోయారు.

నాగబాబు వెళ్లిపోయినప్పుడు ఒంటి చేత్తో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలను నడిపించారు రోజా. అప్పుడు రోజాకు తోడుగా ఉండేందుకు మరో జడ్జిగా వారానికి ఒకరు వచ్చేవారు.. రోజా పక్క ఛైర్‌లో కూర్చొని గంటసేపు నవ్వి వెళ్లిపోయేవారు. ఎవరూ పర్మినెంట్‌గా ఉండలేకపోయారు. ఎప్పుడైతే సింగర్ మనో వచ్చాడో.. అప్పుడు మళ్లీ ఆ ఛైర్‌కు నిండుతనం వచ్చింది. కానీ సడెన్‌గా ఆయన కూడా వెళ్లిపోయాడు. దీంతో జబర్దస్త్ అభిమానులంతా షాకయ్యారు. మనో ఎందుకు వెళ్లిపోయారు? మల్లెమాలతో ఏమైనా విబేధాలు వచ్చాయా? అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సింగర్ మనో స్పందించాడు. జబర్దస్త్‌ను ఎందుకు వీడాల్సి వచ్చిందో రీజన్ బయటపెట్టాడు.

జబర్దస్త్‌ షో మానేయలేదని.. చిన్న గ్యాప్ ఇచ్చా అంతేనని సింగర్ మనో స్పష్టం చేశారు. గతంలో కమిట్ అయిన కొన్ని షోలు కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయని తెలిపారు. వీటిలో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ షోలు కూడా ఉన్నాయని చెప్పారు. 2020లో ఈ షోలు కన్ఫార్మ్ అయ్యాయని.. కానీ కరోనా కారణంగా ఈ షోలు వాయిదా పడ్డాయని తెలిపారు. ఇవి ఫిబ్రవరి వరకు కొనసాగుతాయని.. మార్చి తర్వాత రెండు షోలను బ్యాలెన్స్ చేసుకుంటానని స్పష్టం చేశాడు. తనకు కామెడీ అంటే ఇష్టమని.. తన కామెడీ టైమింగ్ గురించి చాలామందికి తెలుసని ఆయన అన్నారు. జబర్దస్త్‌లోని అద్భుతమైన కామెడీ టైమింగ్‌ను మూడేళ్ల పాటు పూర్తిగా ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ జబర్దస్త్‌లో కనిపిస్తానని చెప్పాడు. ప్రస్తుతం సరిగమప తెలుగు ఛాంపియన్‌షిప్ షోకి సింగర్ మనో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News