Thursday, June 13, 2024
- Advertisment -
HomeEntertainmentMovies of the week | క్రిస్మస్‌ కానుకగా ఓటీటీ/థియేటర్‌లో రిలీజవుతున్న సినిమాలివే.. మీరు ఏది...

Movies of the week | క్రిస్మస్‌ కానుకగా ఓటీటీ/థియేటర్‌లో రిలీజవుతున్న సినిమాలివే.. మీరు ఏది చూస్తారు?

Movies of the week | క్రిస్మస్‌ కానుకగా బోలెడన్నీ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే క్రిస్మస్‌ పండుగకు వారం ముందే వచ్చిన జేమ్స్‌ కామెరూన్‌ విజువల్‌ వండర్‌ అవతార్‌2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమాను చూసేందుకు చిన్నా పెద్దా ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్‌లో ఈ హవా కొనసాగుతున్న టైమ్‌లోనే మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్‌లో వస్తున్న సినిమాలేంటి? ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న సినిమాలేంటి ఒకసారి తెలుసుకుందాం..

లాఠీ

విశాల్‌ హీరోగా వస్తున్న లాఠీ సినిమా తెలుగు ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్దమైంది. ఈ నెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సునయన కథానాయికగా నటించిన ఈ సినిమాతో ఆర్‌.వినోద్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మొన్నటివరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలేవీ లేవు. కానీ రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌ ఈ సినిమాపై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తుంది.

కనెక్ట్‌

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన హారర్‌ మూవీ కనెక్ట్‌. డిసెంబర్‌ 22న ఈ సినిమా విడుదల కాబోతుంది. తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై నయన్‌ స్వయంగా నిర్మించింది. ఆత్మల కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్‌ విడుదల చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. హారర్‌ మూవీస్‌కి ఎప్పుడూ సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది కాబట్టి సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే చెప్పలేం.

ధమాకా

ఈ వారం రిలీజవుతున్న సినిమాల్లో కాస్త అంచనాలు ఉన్న సినిమా ధమాకా. మాస్‌ మహారాజా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. శ్రీలీల కథానాయిక. క్రాక్‌ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన రవితేజ చేస్తున్న ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌, ట్రైలర్‌ సినిమాకు హైప్‌ తీసుకొచ్చాయి. ఈ నెల 23 నుంచి థియేటర్లలోకి ధమాకా చేయనుంది.

18 పేజిస్‌

నిఖిల్‌ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్‌ కాంబినేషన్‌లో డిసెంబర్‌ 23న వస్తున్న చిత్రం 18 పేజిస్‌, గీతా ఆర్ట్స్‌ 2, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కుమారి 21 ఎఫ్‌ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్‌ కథ అందించిన ఈ సినిమాపై ఫస్ట్‌ నుంచి అంచనాలు ఉన్నాయి. పైగా ఈ మధ్య రిలీజైన ట్రైలర్‌తో ఇది కేవలం లవ్‌స్టోరీ కాదని ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయని అర్థమవుతుంది. ఈ ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. యూత్‌ ఎక్కువగా ఈ సినిమాకే ఓటు వేసే ఛాన్స్‌ ఉంది.

సర్కస్‌

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా వస్తున్న బాలీవుడ్‌ మూవీ సర్కస్‌. పూజా హెగ్డే, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కథానాయికలు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 23న విడుదలవుతుంది. తెలుగు వర్షన్‌లో కూడా ఈ సినిమా రిలీజ్‌ అవుతుందనే టాక్‌ వినిపిస్తుంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత రానుంది.

ఓటీటీలోకి వస్తున్న సినిమాల జాబితా ఇదీ..

మసూద ( ఆహా )

దెయ్యాల సినిమాలు అంటేనే కామెడీ అయిపోయాయి. ఇలాంటి టైమ్‌లో ఫుల్‌ లెంగ్త్‌ హారర్‌ మూవీగా వచ్చి అలరించిన సినిమా మసూద. సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్‌ 21వ తేదీ నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

జయ జయ జయ జయహే ( నెట్‌ఫ్లిక్స్‌)

మలయాళంలో చిన్న సినిమాగా రిలీజై సంచలనం సృష్టించింది జయ జయ జయ జయహే. బసిల్‌ జోసెఫ్‌, దర్శన రాజేంద్రన్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. డిసెంబర్‌ 22 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. వీటితో పాటు మరికొన్ని కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నాయి.

ఎమిలి ఇన్‌ పారిస్ ( డిసెంబర్‌ 21)
ఎలైస్‌ ఇన్‌ బోర్డర్‌ ల్యాండ్ ( డిసెంబర్‌ 22)
గ్లాస్ ఆనియన్స్‌- నైవ్స్‌ అవుట్‌ మిస్టరీ ( డిసెంబర్‌ 23)
ది ఫాబ్యూలస్‌ ( డిసెంబర్‌ 23 )
ది టీచర్‌ (మలయాళం) డిసెంబర్ 23

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

నాంది సినిమాతో రూట్‌ మార్చిన అల్లరి నరేశ్‌ లేటెస్ట్‌ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబర్‌ 23 నుంచి జీ5 యాప్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో పాటు పిచర్స్‌ అనే హిందీ సిరీస్‌ కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది.

ఇవే కాకుండా డిసెంబర్‌ 21 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో జాక్‌ ర్యాన్‌, డిస్నీ హాట్‌స్టార్‌లో బిగ్‌ బెట్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Bigg Boss season 7 | బిగ్‌బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున మనసులో ఉన్న హీరో ఎవరు?

Itlu maredumilli prajaneekam | ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేశ్ కొత్త చిత్రం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Mrunal Thakur | రెమ్యునరేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్

Hanu Raghavapudi | సీతారామం సినిమాలో తెలుగు హీరోయిన్‌ను తీసుకోకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News