Tuesday, May 28, 2024
- Advertisment -
HomeEntertainmentBalagam Movie | బలగం సినిమాకు కేటీఆర్ ఫుల్ సపోర్ట్.. తెలంగాణ నినాదంతో మోగిపోయిన సిరిసిల్ల..

Balagam Movie | బలగం సినిమాకు కేటీఆర్ ఫుల్ సపోర్ట్.. తెలంగాణ నినాదంతో మోగిపోయిన సిరిసిల్ల..

Balagam Movie | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి నేపథ్యం ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి అనేది కాదనలేని నిజం. ఒకప్పుడు కేవలం కమెడియన్లు, విలన్లకు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాను ఏలేస్తుంది.

తాజాగా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన మరో సినిమా బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడుగా మారాడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సిరిసిల్లలో జరగ్గా.. దానికి తెలంగాణ ఐటి మినిస్టర్ కేటిఆర్ ముఖ్యఅతిథిగా వచ్చాడు. ఆయన రాకతో బలగంకు నిజంగానే బలం పెరిగిపోయింది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న ఈ సినిమాను ఆయన కూతురు హన్షిత రెడ్డి, తమ్ముడి కొడుకు హర్షిత్ సంయుక్తంగా నిర్మించారు. మంచి కంటెంట్ ను నమ్ముకొని బలగం సినిమాకు బ్యాకప్ చేశాడు దిల్ రాజు. ఇప్పుడు కేటీఆర్ లాంటి వాళ్ళ అండదండలు కుదరడంతో సినిమా గురించి ఇండస్ట్రీలో ఒక్కసారిగా చర్చ మొదలైంది.

మార్చ్ 3న బలగం విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లే ఇంత మంది కళాకారులు ఇప్పుడు బయటకు వస్తున్నారని.. తమకు నచ్చిన సినిమాలు చేయగలుగుతున్నారని చెప్పాడు.
ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు సినిమాల్లో ఇప్పుడు చాలా బాగా కనిపిస్తున్నాయని.. బలగం సినిమాలో కూడా అలాంటి అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయని నమ్మకంగా చెప్పాడు కేటీఆర్.

మార్చ్ 3న రెండు తెలుగు రాష్ట్రాలు ఈ బలగం సినిమాను చూసి అక్కున చేర్చుకుంటారని.. సిరిసిల్ల బిడ్డ వేణు తెరకెక్కించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధిస్తుందని ఆల్ ద బెస్ట్ చెప్పాడు కల్వకుంట్ల తారక రామారావు. ఈయనతో పాటు సిద్దు జొన్నలగడ్డ కూడా బలగం ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ

Mrunal Thakur | అయ్యో రామా.. సీతకు ఎన్ని కష్టాలో.. ఒక హిట్టు ఇవ్వండయ్యా..!

Telugu Cinema | తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

Nayanthara | నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News