Thursday, May 30, 2024
- Advertisment -
HomeEntertainmentIleana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా...

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

Ileana | గోవా బ్యూటీ ఇలియానా తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. దేవదాస్, పోకిరీ వంటి వరుస హిట్స్‌ అందుకుని తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. మంచి క్రేజ్ మీద ఉండగానే ఇలియానా టాలీవుడ్‌ను వదిలేసింది. బర్ఫీ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అక్కడే సెటిల్ అయిపోయింది. అప్పట్నుంచి తెలుగులోనే కాదు.. అసలు సౌత్‌లోనే సినిమాలు చేయడం మానేసింది. బాలీవుడ్ మీద మోజుతోనే సౌత్ ఇండస్ట్రీపై ఇలియానా చిన్నచూపు చూసిందని ఇన్నిరోజులు అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదంట. ఆమె మీద సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్ విధించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాలీవుడ్‌కు వెళ్లిపోయిందని సమాచారం.

2012లో వచ్చిన దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత ఇలియానా బర్ఫీ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆమెకు తొలుత మంచి ఆఫర్సే వచ్చాయి. కానీ అదృష్టం కలిసిరాలేదు. దీంతో చాలా తక్కువ టైమ్‌లో అక్కడ ఫేడవుట్ అయిపోయింది. అయినా సరే అక్కడే అవకాశాల కోసం చూస్తుంది తప్ప సౌత్ ఇండస్ట్రీపై ఇంతవరకు కన్నెత్తి చూడలేదు. దీంతో గోవా బ్యూటీపై రకరకాల వార్తలు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీని చిన్నచూపు చూసి వెళ్లిన ఇలియానాకు మంచి శాస్తి జరిగిందని కూడా కొంతమంది తిట్టుకున్నారు. అయితే ఆమె కావాలని సౌత్ ఇండస్ట్రీని వదులుకోలేదంట. ఆమెపై సౌత్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిషేధం విధించడంతోనే బాలీవుడ్ వెళ్లిపోయిందన్న నిజం దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు బయటపడింది.

అప్పట్లో కోలీవుడ్ నిర్మాత నటరాజ్ విక్రమ్ హీరోగా నందం అనే మూవీని ప్లాన్ చేశాడు. ఈ సినిమాకు ఇలియానాను హీరోయిన్‌గా ఫిక్సయ్యాడు. సినిమా కోసం రూ.40 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. కానీ కొన్ని కారణాలతో సినిమా ఆగిపోయింది. దీంతో అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వమని ఇలియానాను నటరాజ్ కోరాడు. ఇందుకు గోవా బ్యూటీ నిరాకరించింది. కావాలంటే మరో సినిమా చేస్తే తప్ప డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేనని కరాఖండీగా చెప్పేసింది. దీంతో నటరాజ్ వెళ్లి నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు. దీంతో పాటు సౌత్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను కూడా ఆశ్రయించారు. ఈ రెండు సంఘాలు చెప్పినప్పటికీ ఇల్లూ బేబీ వినిపించుకోలేదు. తమ మాట విని రాజీకి రాకపోవడంతో ఆగ్రహించిన రెండు సంఘాలు కూడా ఇలియానాపై బ్యాన్ విధించాయి. అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించేదాకా సౌత్ సినిమాల్లో ఇలియానాను హీరోయిన్‌గా తీసుకోవద్దని నిర్ణయించుకున్నారు. అందుకే ఆమె తెలుగు సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా ఇలియానాకు అవకాశాలు రాకపోవడంతో సౌత్ సినిమాల్లో విధించిన నిషేధం ఎత్తివేయించునేందుకు గట్టిగా ప్రయత్నిస్తుందట. ఈ క్రమంలోనే నిర్మాత నటరాజ్‌ను కలిసి వివాదం పరిష్కరించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమెపై నిషేధం ఎత్తివేస్తే మళ్లీ సౌత్ ఇండస్ట్రీలో సినిమాలతో బిజీ కావాలని గోవా బ్యూటీ అనుకుంటున్నట్లు ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | అన్నయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. సంచలన విషయం బయపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

Prabhas – Kriti Sanon | మాల్దీవుల్లో ప్రభాస్‌తో కృతిసనన్‌ ఎంగేజ్‌మెంట్‌.. అసలు నిజమిదీ !!

Samyuktha | మా నాన్న పేరు అడ్డుగా అనిపించింది.. అందుకే తీసేస్తున్నా.. మలయాళ బ్యూటీ సంయుక్త సంచలన నిర్ణయం

Kirak RP | కిరాక్‌ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు వాళ్ల భిక్షే.. జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్ రాకేశ్‌ సెన్సేషల్‌ కామెంట్స్‌

Kutty Padmini | రూంలో అడ్జస్ట్‌ అవ్వమని దర్శకులు అడిగారు.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగే అదృష్టం లేకపోయింది.. బయటపెట్టిన సీనియర్‌ నటి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News