Thursday, May 30, 2024
- Advertisment -
HomeNewsInternationalSingle man | 38 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తట్లేదని కొడుకుపై డౌట్‌తో ఆస్పత్రికి...

Single man | 38 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తట్లేదని కొడుకుపై డౌట్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. అసలు సమస్య ఏంటో తెలిసి షాక్ !

Single man | పాతికేళ్లు దాటయంటే చాలు ఇంట్లో వాళ్లతో పాటు చుట్టుపక్కల వాళ్లు అడిగే ప్రశ్న.. పెళ్లెప్పుడూ అని! వయసు మీద పడుతున్నా కొద్దీ ఈ ప్రశ్న అడిగేవాళ్ల సంఖ్య పెరిగిపోతుంటుంది. ఇంట్లో వాళ్లకు కంగారు పెరిగిపోతుంటుంది. అలాగే 38 ఏళ్లు వచ్చినా ఓ అబ్బాయికి పెళ్లి సెటిల్ కాకపోవడంతో అతని తల్లి కూడా చాలా బెంగ పెట్టుకుంది. ఇంత వయసు వచ్చినా పెళ్లెప్పుడు చేస్తారని అడగకపోవడం.. కనీసం గర్ల్‌ఫ్రెండ్ కూడా లేకపోవడంతో ఆమె భయం మరింత రెట్టింపు అయ్యింది. వీడికి ఏదో ప్రాబ్లెం ఉందని హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. తీరా ఆస్పత్రికి వెళ్లిన తర్వాత డాక్టర్ చెప్పిన సమాధానం విని కంగుతింది. అసలు సమస్య ఏంటో తెలిసి నోరెళ్లబెట్టింది.

చైనా హెనాన్‌ ప్రావిన్స్‌లోని వాంగ్‌ అనే వ్యక్తికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదు. పెళ్లి ఊసెత్తకుండా ఇంకా సింగిల్‌గానే ఉంటున్నాడు. దీంతో అతని తల్లికి బెంగ పెట్టుకుంది. 38 ఏళ్లు వచ్చినా వాంగ్‌కు గర్ల్‌ఫ్రెండ్ లేకపోవడంతో ఆమెలో అనుమానం మొదలైంది. ఏదో సమస్య ఉందని భావించింది. అందుకే 2020 నుంచి అతన్ని మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పిస్తుంది. ప్రతి ఏటా లూనార్ న్యూఇయర్ తర్వాత వాంగ్‌ను మానసిక వైద్యుల దగ్గరకు తీసుకెళ్తుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో వాంగ్‌ను మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. అక్కడ ఇద్దరినీ పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. అసలు సమస్య అంతా తనకే ఉందని.. మీ కొడుకుకు ఎలాంటి ప్రాబ్లెం లేదని చెప్పేసరికి కంగుతింది. కొడుక్కి పెళ్లి అవ్వట్లేదనే బెంగతో మెంటల్ డిజార్డర్ వచ్చిందని చెప్పడంతో షాకైంది.

ఇక అంత వయసు వచ్చినా పెళ్లి ఎందుకు చేసుకోలేదో వాంగ్ చెప్పాడు. పదేళ్లుగా ఉద్యోగంలో తీరిక లేకపోవడం వల్లే ప్రేమ, పెళ్లి ఊసెత్తలేదని స్పష్టం చేశాడు. సమస్య లేకపోయినప్పటికీ తన తల్లి సంతోషం కోసమే హాస్పిటల్‌కు వెళ్తున్నానని తెలిపాడు. సరైన భాగస్వామి తారసపడితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. కనీసం ఇల్లు కొనుక్కునేందుకు డబ్బులు కూడా లేని తనను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని ప్రశ్నించాడు. ఈ కథనం కాస్తా మీడియాలో రావడంతో చాలా మంది దీని గురించి స్పందిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Formula-E Race | ఫార్ములా-ఈ ట్రాక్‌పైకి రయ్‌మంటూ దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు.. రేసర్లకు హైదరాబాద్ వాసుల షాక్‌

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News