Sunday, April 14, 2024
- Advertisment -
HomeEntertainmentPawan Kalyan | అన్నయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. సంచలన విషయం బయపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | అన్నయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. సంచలన విషయం బయపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ఆయన్ను ఆరాధిస్తారు. చాలామంది ఫ్యాన్స్‌ పవన్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉన్న పవన్‌ కళ్యాణ్‌.. చిన్నతనంలోనే సూసైడ్‌ చేసుకోవాలని అనుకున్నాడట. 17 ఏళ్లకే జీవితంపై విరక్తి చెంది ప్రాణాలు తీసుకుందామని భావించాడట. ఈ విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా బయటపెట్టాడు.

నట సింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ షో ప్రేక్షకుల నుంచి చాలా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ షోకు తాజాగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వచ్చాడు. పవన్‌ పాల్గొన్న మొదటి ఎపిసోడ్ గత వారం ప్రచారం కాగా, రెండో ఎపిసోడ్ తాజాగా ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ షోలో పవన్ తన పర్సనల్ విషయాలను వెల్లడించారు. అటు సినీ జీవితంతో పాటు గత జీవితంలోనూ పవన్ ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకుల గురించి వివరించారు.

” నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా, జ్వరం ఉండేవి. దాని వలన ఎక్కువ శాతం ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చేది. ఆరు, ఏడు తరగతుల వరకు నాకు స్నేహితులు కూడా ఎవరు ఉండేవారు కాదు. ఎప్పుడూ కూడా పుస్తకాలతోనే గడపాల్సి వచ్చేది. కాలేజీకి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడేవాణ్ని. తన తోటి వారంతా ఉన్నత చదువులు, క్రికెట్ లో రాణిస్తుంటే నేను మాత్రం కనీసం పరీక్షల్లో కూడా పాస్ కాలేకపోయాను. 17 సంవత్సరాల వయసులోనే ఆత్మనూన్యత భావంతో బాధపడేవాణ్ని.. అలాంటి సమయంలోనే చనిపోతే బాగుండు అనుకున్నాను. అన్నయ్య లైసెన్స్ రివాల్వర్ తీసుకుని కాల్చుకుందామని అనుకున్నాను..” అంటూ సంచలన విషయాలను బయటపెట్టాడు.

” తుపాకీతో కాల్చుకుందామన్న విషయాన్ని సురేఖ వదిన, నాగబాబు అన్నయ్య గమనించి ఎందుకలా ఉన్నావని అడిగారు. కాల్చుకుందామనుకుంటున్నానని చెప్పడంతో చిరంజీవి అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లి.. అసలు విషయం చెప్పారు. అప్పుడే చిరు అన్నయ్య చదవకపోయినా పర్లేదని.. బతికుంటే చాలునన్నారని” పవన్ చెప్పుకొచ్చారు.

చిరంజీవి గురించి పవన్ కళ్యాణ్ చెబుతూ.. ‘ ఒళ్ళు దాచుకోకుండా కష్టపడే తత్వాన్ని అన్నయ్య నుంచే నేర్చుకున్నాను. రాజకీయాల్లో విమర్శలు కచ్చితంగా స్వీకరించాల్సిందే ఎన్ని విమర్శలు అయినా భరించాల్సిందే. దాన్ని కూడా నేను అన్నయ్య నుండి నేర్చుకున్నాను. ‘ అని చెప్పాడు.

అభిమానం వేరు రాజకీయం వేరు. అభిమానం ఓటుగా మారడం వేరు. సినిమా రంగంలో ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నా కూడా ఉన్నత స్థాయికి చేరాలనుకున్న కూడా సమయం పడుతుంది. సినీ పరిశ్రమలో పేరు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి ప్రవేశించి అంతటి నమ్మకం పొందాలంటే కాస్త సమయం పడుతుంది. రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయని నేను అనుకోను. అందుకే కచ్చితంగా భవిష్యత్తులో జనాలు మార్పు కోరుకుంటారని అన్నారు పవన్ కళ్యాణ్.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Prabhas – Kriti Sanon | మాల్దీవుల్లో ప్రభాస్‌తో కృతిసనన్‌ ఎంగేజ్‌మెంట్‌.. అసలు నిజమిదీ !!

Samyuktha | మా నాన్న పేరు అడ్డుగా అనిపించింది.. అందుకే తీసేస్తున్నా.. మలయాళ బ్యూటీ సంయుక్త సంచలన నిర్ణయం

Kirak RP | కిరాక్‌ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు వాళ్ల భిక్షే.. జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్ రాకేశ్‌ సెన్సేషల్‌ కామెంట్స్‌

Kutty Padmini | రూంలో అడ్జస్ట్‌ అవ్వమని దర్శకులు అడిగారు.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగే అదృష్టం లేకపోయింది.. బయటపెట్టిన సీనియర్‌ నటి

Sidharth malhotra & Kiara Advani | గ్రాండ్‌గా కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి.. హనీమూన్ మాత్రం లేదంట..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News