Monday, March 27, 2023
- Advertisment -
HomeEntertainmentKutty Padmini | రూంలో అడ్జస్ట్‌ అవ్వమని దర్శకులు అడిగారు.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగే అదృష్టం...

Kutty Padmini | రూంలో అడ్జస్ట్‌ అవ్వమని దర్శకులు అడిగారు.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగే అదృష్టం లేకపోయింది.. బయటపెట్టిన సీనియర్‌ నటి

Kutty Padmini | పిల్లలు దేవుడు చల్లని వారే.. కల్లకపటం ఎరుగని కరుణామయులే.. ఈ సాంగ్‌ వినగానే రెండు జడలతో ముద్దు ముద్దుగా ఉండే ఓ చిన్న పాప గుర్తొస్తుంది కదూ.. ఆ పాప పేరు కుట్టి పద్మిని. మూడేళ్ల వయసులోనే బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన కుట్టి పద్మిని చాలా సినిమాల్లో మెప్పించింది. అతిలోక సుందరి శ్రీదేవితో పాటే కెరీర్ మొదలుపెట్టిన ఈమె చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చాలా పాపులారిటీ సంపాదించుకుంది. బాల నటిగా జాతీయ అవార్డులు కూడా అందుకుంది. కానీ పెద్దయ్యాక శ్రీదేవి స్టార్‌ హీరోయిన్‌గా మారితే.. కుట్టి పద్మిని మాత్రం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే ఉండిపోయింది. దీనికి గల కారణాన్ని.. ఆ రోజుల్లో దర్శక నిర్మాతల నుంచి ఎదురైన క్యాస్టింగ్‌ కౌచ్‌ వేధింపుల గురించి తాజాగా కుట్టి పద్మిని బయటపెట్టింది.

తనకు పదహారేళ్ల వయసు ఉన్నప్పుడు సావిత్రి, జమున స్టార్‌ హీరోయిన్లుగా కొనసాగుతున్నారని గుర్తు చేసుకుంది. అదే టైమ్‌లో తనతో పాటు శ్రీదేవి కూడా హీరోయిన్‌గా ట్రై చేస్తుంది. ఆ సమయంలో అడ్జస్ట్‌ అవుతారా అని కొంతమంది దర్శకులు తనను అడిగారని గుర్తు చేసుకుంది. కానీ తనకు ఇష్టం లేకపోవడంతో నో చెప్పానని తెలిపింది. అలాగే తనకు గ్లామర్‌ డ్రెస్సులు అంటే నచ్చవని.. కేవలం డ్రామా అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది. దీంతో కొన్ని సినిమాల్లో ఛాన్సులు మిస్సయ్యాయని.. కొన్నింటినీ తానే వదులుకున్నానని తెలిపింది. అయితే తనతో పాటు కెరీర్‌ మొదలుపెట్టిన శ్రీదేవి మాత్రం బాగా ఫేమస్‌ అయ్యిందని చెప్పింది. ఆ అదృష్టం తనకు రాలేదని బాధపడింది.

సినిమాల్లో రాణించకపోయినప్పటికీ జీవితంలో మాత్రం సంతృప్తిగానే ఉందని కుట్టి పద్మిని తెలిపింది. ప్రస్తుతం 140 మందికి జీతాలు ఇచ్చే స్థాయిలో ఉన్నానని పేర్కొంది. ఎవరెవరు తనకు ఆఫర్లు ఇవ్వలేదో.. వాళ్లకే ఇప్పుడు ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని చెప్పింది. ఎవరైతే తనను రూమ్‌లో అడ్జస్ట్‌ అవ్వాలని అడిగారో వాళ్లకే ఇప్పుడు సాయం అందించడం సంతృప్తిని ఇచ్చిందని తెలిపింది. సినిమాల్లో శోభన్‌ బాబుతో ఎక్కువగా చనువు ఉండేదని కుట్టి పద్మిని తెలిపింది. చిన్నతనం నుంచి సినిమాలు చేస్తూ ఉండటం వల్ల చదువుకోవడం కుదరలేదని ఆమె చెప్పింది. అయితే చదువుకోకపోయినా ఎలా పైకి రావాలో శోభన్‌ బాబు తనకు చెప్పేవారని గుర్తుతెచ్చుకుంది. ఆడపిల్లలు ఖాళీగా ఇంటి దగ్గరే ఉండకుండా తమను తాము ఎలా డెవలప్‌ చేసుకోవాలో సలహాలు ఇచ్చేవారని చెప్పింది. ఆయన మాటలను ఆచరణలో పెట్టడం వల్లే ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నానని తెలిపింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sidharth malhotra & Kiara Advani | గ్రాండ్‌గా కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి.. హనీమూన్ మాత్రం లేదంట..

Tamannah Bhatia | బాలీవుడ్‌ నటుడితో పెళ్లి పుకార్లు.. దైవ చింతనపై ధ్యాస పెట్టిన తమన్నా.. మొన్న ఏమో హిమాలయాలకు..

Jabardasth Punch Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ పంచ్ ప్రసాద్‌కు ఎవరు ఎక్కువగా సాయం అందిస్తున్నారు?

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News