Tuesday, May 28, 2024
- Advertisment -
HomeEntertainmentSamyuktha | మా నాన్న పేరు అడ్డుగా అనిపించింది.. అందుకే తీసేస్తున్నా.. మలయాళ బ్యూటీ సంయుక్త...

Samyuktha | మా నాన్న పేరు అడ్డుగా అనిపించింది.. అందుకే తీసేస్తున్నా.. మలయాళ బ్యూటీ సంయుక్త సంచలన నిర్ణయం

Samyuktha | పాప్‌కార్న్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీ సంయుక్త మీనన్. రీసెంట్‌గా భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులోకి కూడా అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ధనుష్ హీరోగా వస్తున్న సార్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న సంయుక్త మీనన్ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. తన పేరు ఇప్పుడు సంయుక్త మీనన్ కాదని.. కేవలం సంయుక్త అని మాత్రమే పిలవాలని స్పష్టం చేసింది. తన పేరు మార్చుకోవడానికి గల కారణాలను వివరించింది.

తన పేరు వెనుక ఉన్న మీనన్‌ తీసేయాలని ఎప్పట్నుంచో అనుకున్నా.. కానీ ఇన్నేళ్లకు ఆ అవకాశం లభించిందని సంయుక్త మీనన్ తెలిపింది. స్కూల్‌లో చేరినప్పుడు మన పేరు చివర.. ఇంటి పేరు రాస్తుంటారని.. అలాగే తన పేరును సంయుక్త మీనన్‌గా రిజిస్టర్‌లో ఎక్కించారని చెప్పింది. అప్పట్లో దాని గురించి పెద్ద అవగాహన లేదని.. తర్వాత ఒక వ్యక్తి పేరు ఎందుకు తోకలా ఉండాలనే ఆలోచన మొదలైందని పేర్కొంది.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత నటిగా తన బాధ్యత తనకు తెలిసొచ్చిందని.. మీనన్ అనే పదం తన పేరు పక్కన ఉండటం సబబు కాదనిపించిందని తెలిపింది. సమానత్వం, మానవత్వం, ప్రేమ అన్నింటినీ కోరుకున్నప్పుడు ఇంటి పేరు అడ్డొస్తుందని చెప్పింది. అది కాకుండా తన తల్లిదండ్రులు చాలా కాలం కిందట విడాకులు తీసుకున్నారని.. నాన్న పేరును ఇంటిపేరుగా కొనసాగించడం తనకు ఇష్టం లేదని చెప్పింది. వాళ్ల అమ్మ అభిప్రాయాన్ని గౌరవించి తన పేరు వెనుక ఉన్న మీనన్‌ను తీసేస్తున్నా అని ప్రకటించింది. ఇకపై తనను సంయుక్త అని మాత్రమే పిలవాలని చెప్పింది. ప్రస్తుతం సార్ సినిమాతో పాటు సాయిధరమ్ తేజ్ విరూపాక్షలోనూ సంయుక్త నటిస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sidharth malhotra & Kiara Advani | గ్రాండ్‌గా కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి.. హనీమూన్ మాత్రం లేదంట..

Tamannah Bhatia | బాలీవుడ్‌ నటుడితో పెళ్లి పుకార్లు.. దైవ చింతనపై ధ్యాస పెట్టిన తమన్నా.. మొన్న ఏమో హిమాలయాలకు..

Jabardasth Punch Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ పంచ్ ప్రసాద్‌కు ఎవరు ఎక్కువగా సాయం అందిస్తున్నారు?

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News