Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentKirak RP | కిరాక్‌ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు వాళ్ల భిక్షే.. జబర్దస్త్‌ కమెడియన్‌...

Kirak RP | కిరాక్‌ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు వాళ్ల భిక్షే.. జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్ రాకేశ్‌ సెన్సేషల్‌ కామెంట్స్‌

Kirak RP | జబర్దస్త్‌ కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ మొదలుపెట్టిన కర్రీపాయింట్‌ ఇప్పుడు మూడు పూలు ఆరు కాయలు అన్నట్టు సాగుతోంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఏరియాలో మొదలుపెట్టిన బిజినెస్‌ ఇప్పుడు బాగా క్లిక్‌ అయ్యింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆర్పీ దగ్గర చేపల పులుసు కొనుక్కెళ్తున్నారు.

ఎన్నో కష్టాలు పడి జబర్దస్త్‌ కామెడీ షోకి వచ్చిన తర్వాత గుర్తింపు తెచ్చుకున్నాడు ఆర్పీ. చమ్మక్‌ చంద్ర స్కిట్‌లో కంటెస్టెంట్‌గా చేసిన ఆర్పీ.. ఆ తర్వాత టీమ్‌ లీడర్‌గా మారాడు. నెల్లూరు యాసలో డైలాగులు చెబుతూ పాపులర్‌ అయ్యాడు. నాగబాబు జబర్దస్ మానేసి వెళ్లిపోవడంతో కిరాక్‌ ఆర్పీ కూడా మానేశాడు. స్టార్‌ మాలో ఓ కామెడీ షోలో కొద్దిరోజులు కనిపించాడు. ఆ షో పెద్దగా వర్కవుట్‌ కాకపోవడంతో తక్కువ టైమ్‌లోనే మూసేశారు. దీంతో కొద్దిరోజులు ఇబ్బంది పడ్డప్పటికీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మొదలుపెట్టి చేతినిండా సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో కిరాక్‌ ఆర్పీపై రాకింగ్‌ రాకేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకింగ్‌ రాకేశ్‌ దగ్గర కిరాక్‌ ఆర్పీ గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో కిరాక్‌ ఆర్పీ చేపల పులుసు బిజినెస్‌ కూడా జబర్దస్త్‌ పెట్టిన భిక్షనే అని రాకింగ్‌ రాకేశ్‌ చెప్పుకొచ్చాడు. ఆర్పీనే కాదు.. మేమందరం ఇప్పుడు ఇలా ఉన్నామంటే దానికి కారణం మల్లెమాల, జబర్దస్త్‌ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మధ్య ఆర్పీని కలిశారా అని అడగ్గా.. లేదండీ.. అంత పెద్దవాళ్లను కలిసే అదృష్టం నాకు లేదు.. మేమేదో చిన్న ఆర్టిస్టులం.. వాళ్లు చాలా పెద్దవాళ్లు అంటూ ఆర్పీపై సెటైర్లు వేశారు. ఈ కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

కిరాక్‌ ఆర్పీ గురించి రాకింగ్‌ రాకేశ్‌ అలా మాట్లాడటం వెనుక ఓ కారణం ఉంది. జబర్దస్త్‌ మానేసిన తర్వాత ఆ షోపై, మల్లెమాలపై ఆర్పీ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశాడు. అక్కడ ఆర్టిస్టులకు గౌరవం ఉండదని.. ఫుడ్‌ కూడా సరిగ్గా ఉండదంటూ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. దీంతో పలువురు జబర్దస్త్‌ కమెడియన్లు ఆర్పీ వ్యాఖ్యలను ఖండించారు. ఈ క్రమంలోనే తమకు జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్‌పై తప్పుడు ప్రచారం చేయడంతో కిరాక్‌ ఆర్పీపై రాకింగ్‌ రాకేశ్‌ కూడా కాస్త కోపంగా ఉన్నాడు. అందుకే ఛాన్స్‌ దొరికిందని అతనిపై సెటైర్‌ వేశాడని నెటిజన్లు అనుకుంటున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sidharth malhotra & Kiara Advani | గ్రాండ్‌గా కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి.. హనీమూన్ మాత్రం లేదంట..

Tamannah Bhatia | బాలీవుడ్‌ నటుడితో పెళ్లి పుకార్లు.. దైవ చింతనపై ధ్యాస పెట్టిన తమన్నా.. మొన్న ఏమో హిమాలయాలకు..

Jabardasth Punch Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ పంచ్ ప్రసాద్‌కు ఎవరు ఎక్కువగా సాయం అందిస్తున్నారు?

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News