Wednesday, May 22, 2024
- Advertisment -
HomeEntertainmentDhamaka | పోటీ వ్యూహంలో రవితేజ.. గెలుపు కోసం గారడీ చేయాల్సిందే..!

Dhamaka | పోటీ వ్యూహంలో రవితేజ.. గెలుపు కోసం గారడీ చేయాల్సిందే..!

Dhamaka | క్రాక్‌ సినిమాతో గ్రాండ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు మాస్‌ మహారాజా రవితేజ. కానీ దాన్ని కంటిన్యూ చేయడంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. క్రాక్‌ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఖిలాడీ బోల్తా కొట్టింది. ఫస్ట్‌ డేనే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్ల మాట అటుంచితే కనీసం పావు వంతు బడ్జెట్‌ను కూడా రాబట్టలేకపోయింది. ఇక రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా కూడా అంతగా సక్సెస్‌ కాలేదు. క్రాక్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని అనుకుంటున్న టైమ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ డిజాస్టర్లు రావడంతో రవితేజ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు మాస్‌ మహారాజా. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ కూడా ధమాకా సినిమాపైనే ఉన్నాయి.

త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ధమాకా సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23న రిలీజ్‌ కాబోతుంది. ఇప్పటివరకు రిలీజైన పాటలు, ట్రైలర్‌ ఈ సినిమాపై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేశాయి. పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల గ్లామర్ దీనికి మరింత తోడయ్యాయి. దీంతో రవితేజకు బ్లాక్‌బస్టర్‌ పక్కా అని అనుకుంటున్నారు. కానీ అదంతా ఈజీగా కనిపించడం లేదు. సూపర్‌ హిట్ టాక్‌ తెచ్చుకుని మ్యాజిక్‌ చేస్తే తప్ప బ్లాక్‌బస్టర్‌ అవ్వడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు ఒకటి.. రెండు కాదు నాలుగు సినిమాలు పోటీగా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చిన ధమాకాకు కలెక్షన్లు తగ్గిపోవడం ఖాయం.

క్రిస్మస్‌ కానుకగా నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా 18 పేజిస్‌. కార్తికేయ2 వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్న సినిమా ఇది. సుకుమార్‌ కథ అందించిన ఈ సినిమాపై ఫస్ట్‌ నుంచే యూత్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. కేవలం లవ్‌స్టోరీనే అనుకున్న ఈ సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయని తెలియడంతో సినిమాపై బజ్‌ పెరిగింది. ధమాకా, 18 పేజిస్‌ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజవుతున్నా యూత్‌ ఎక్కువగా నిఖిల్‌ సినిమాపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపించే అవకాశం ఉంది.

ధమాకా కంటే ఒక్క రోజు ముందుగానే డిసెంబర్‌ 22న విశాల్‌ నటించిన లాఠీ సినిమా వస్తుంది. విశాల్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. నిజానికి లాఠీ సినిమాపై మొన్నటివరకు అంతగా అంచనాలు లేవు. ప్రమోషన్‌ అంతకంటే లేదు. కానీ ఇటీవల రిలీజైన ట్రైలర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు తీసుకొచ్చింది. పైగా విశాల్‌ కూడా తెలుగులో ప్రమోషన్‌ భారీగానే చేస్తున్నాడు. ఒకవేళ ఈయన సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే.. టాలీవుడ్‌ మిడియం రేంజ్‌ హీరోలకు దీటుగా కలెక్షన్లు రాబడతాయి. కాబట్టి లాఠీ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే ధమాకా కలెక్షన్లపై కచ్చితంగా ఎఫెక్ట్‌ ఉంటుంది.

ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన కనెక్ట్ మూవీ కూడా డిసెంబర్‌ 22న రిలీజ్ కానుంది. ఇప్పటి వరకైతే ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. కానీ హారర్‌ జోనర్‌లో వస్తున్న సినిమా కావడంతో మౌత్ టాక్ పాజిటివ్‌గా వచ్చిందంటే చాలు.. ఆటోమేటిక్‌గా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతుంది. వీటితో పాటుగా రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన సర్కస్‌ సినిమా కూడా ఇదే రోజున వస్తుంది. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్‌ వర్షన్‌ కూడా రెడీ చేసినట్టు టాక్‌ వినిపిస్తుంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది. మరి ఈ సినిమాలను తట్టుకుని మ్యాజిక్‌ చేస్తే తప్ప రవితేజకు బ్లాక్‌బస్టర్‌ పడటం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Bigg Boss season 7 | బిగ్‌బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున మనసులో ఉన్న హీరో ఎవరు?

Itlu maredumilli prajaneekam | ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేశ్ కొత్త చిత్రం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Mrunal Thakur | రెమ్యునరేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్

Hanu Raghavapudi | సీతారామం సినిమాలో తెలుగు హీరోయిన్‌ను తీసుకోకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News