Wednesday, November 29, 2023
- Advertisment -
HomeEntertainmentJanhvi kapoor | కనీసం వాళ్లు చూసినా బాగుండేది.. జాన్వీకపూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Janhvi kapoor | కనీసం వాళ్లు చూసినా బాగుండేది.. జాన్వీకపూర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Janhvi kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటోలను పెడుతూ కుర్రకారు మతి పోగొడుతుంటుంది. అందుకే ఆ ఫొటోలను చూసేందుకు అయినా సరే అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ కపూర్‌కు 21 మిలియన్స్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. మరి ఇలా ఫాలోవర్స్‌ను పెంచుకోవడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా అని జాన్వీని అడిగితే ఆసక్తికరమైన సమాధానమిచ్చింది.

సోషల్‌మీడియాలో హాట్‌ ఫొటోలు వెనుక ఉన్న కారణాన్ని ఇదివరకే జాన్వీ కపూర్‌ బయటపెట్టింది. తన ఫొటోలను చూసేందుకు ఎక్కువమంది ఫ్యాన్స్‌ ఇష్టపడితే తన క్రేజ్‌ పెరిగి.. కొత్త బ్రాండ్లు వస్తాయని.. వాటి ద్వారా ఈఎంఐలు చెల్లించడం ఈజీ అవుతుందని ఇదివరకే జాన్వీ చెప్పింది. అయితే ఫాలోవర్స్‌ను పెంచుకోవడం ద్వారా సినిమాల్లో స్టార్‌ అవ్వాలని ఏదైనా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా? అనే యాంగిల్‌లో తాజాగా జాన్వీకపూర్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. దానికి స్పందించిన జాన్వీ.. నటిగా పేరు తెచ్చుకోవడానికి సోషల్‌మీడియా క్రేజ్‌కు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది.

ఒకవేళ సోషల్‌ మీడియా పాపులారిటీ ఉపయోగపడేది ఉంటే తన సినిమాలు హిట్‌ అయ్యేవని జాన్వీ కపూర్‌ పేర్కొంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు 21 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారని.. వారంతా వెల్లి సినిమా చూసి ఉంటే అది బ్లాక్‌ బస్టర్‌ అయ్యేదని తెలిపింది. నటులు సమాజంపై ప్రభావం చూపిస్తారనేది నిజమేనని.. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ పాలోయింగ్‌ స్టార్‌ డమ్‌కు సంకేతం కాదని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో ఉండే ఇమేజ్‌ తన సినిమాలను ప్రేక్షకులకు దగ్గర చేయడానికే అని తెలిపింది. సోషల్‌ మీడియా అనేది బ్రాండింగ్‌, లైక్స్‌ మాత్రమేనని స్పష్టం చేసింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Bigg Boss season 7 | బిగ్‌బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున మనసులో ఉన్న హీరో ఎవరు?

Itlu maredumilli prajaneekam | ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేశ్ కొత్త చిత్రం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Mrunal Thakur | రెమ్యునరేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్

Hanu Raghavapudi | సీతారామం సినిమాలో తెలుగు హీరోయిన్‌ను తీసుకోకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News