Home Entertainment Dhamaka Trailer Released | రవితేజ ధమాకా ట్రైలర్‌ రిలీజ్‌.. వెనుకున్న వాళ్లను చూసుకొని వచ్చిన...

Dhamaka Trailer Released | రవితేజ ధమాకా ట్రైలర్‌ రిలీజ్‌.. వెనుకున్న వాళ్లను చూసుకొని వచ్చిన వాడిని కాదంటూ పంచ్‌

Dhamaka Trailer Released | క్రాక్‌ సినిమా తర్వాత సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న రవితేజ.. ధమాకా సినిమాతో ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను త్రినాథరావు నక్కిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది ఈ చిత్ర బృందం. రవితేజ మార్క్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పక్కా అనిపించేలా ఈ ట్రైలర్‌ ఉంది.

ధమాకా సినిమాలో రవితేజ డ్యుయెల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. నెల రోజుల్లో ఉద్యోగం సంపాదించాల్సిన నిరుద్యోగిగా.. వెయ్యి కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకున్న బిలియనీర్‌గా ట్రైలర్‌లో కనిపించాడు. రెండు క్యారెక్టర్లలో మంచి వేరియేషన్‌ చూపించాడు. శ్రీలీల కూడా అదుర్స్‌ అనిపించింది. డైలాగ్స్‌ కూడా బాగున్నాయి. అమ్మ పళ్లు తీసుకురమ్మంది అనే డైలాగ్‌ అదిరిపోయింది. వెనుక ఉన్నోళ్లను చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్‌.. వెనుక ఎవరూ లేకపోయినా ముందుకు రావచ్చని ఎగ్జాంపుల్‌ సెట్‌ చేసినవాడిని అంటూ ట్రైలర్‌ చివరలో రవితేజ డైలాగ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా రోజుల తర్వాత మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు ఫుల్‌ మీల్స్‌ అందించేలా సినిమా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Shriya saran | ప్రెగ్నెన్సీ విషయం అందుకే దాచాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పిన శ్రియ

Manchu Lakshmi | సరిదిద్దుకోలేని తప్పులు చేశా.. మంచు లక్ష్మీ భావోద్వేగం

kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు

Pavala Shyamala | నాకు జరిగిన అవమానం తెలిస్తే చిరంజీవి సహించరు.. ఎమోషన్‌ అయిన పావలా శ్యామల

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

Parineeti Chopra | ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌.. సౌత్‌ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం బతిమిలాడుతున్న బాలీవుడ్‌ బ్యూటీ

Exit mobile version