Home Lifestyle Do you know Swap village | ఆరు నెలలకు ఒకసారి దేశం మారే దీవి.. ఈ వింత మీకు...

Swap village | ఆరు నెలలకు ఒకసారి దేశం మారే దీవి.. ఈ వింత మీకు తెలుసా !!

Swap village | ఈ వింత మీకు తెలుసా ! యూరప్‌లోని ఒక దీవి ఆరు నెలలకు ఒకసారి దేశం మారుతుంటుంది. ఈ దీవి మొదటి ఆరు నెలలు ఫ్రాన్స్‌లో ఉంటే.. మరో ఆరు నెలలు స్పెయిన్‌కు వెళ్తుంది. అదేంటి ఒక ప్రాంతం ఒక దేశం నుంచి మరో దేశానికి ఎలా వెళ్తుందని అనుకుంటున్నారా? దీని వెనుక ఒక చరిత్ర ఉంది.

యూరప్‌లోని స్పెయిన్ ( Spain ), ఫ్రాన్స్ ( France ) దేశాల మధ్య అప్పట్లో పెద్ద యుద్ధమే జరిగింది. దాదాపు 30 ఏళ్లు వీటి మధ్య యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాత యుద్ధం ముగిసింది. కానీ ఈ రెండు దేశాల మధ్య బిడసోవా నదిలో ఉన్న ఫిసంట్ ( Pheasnat Island ) అనే ఐలాండ్‌ను పంచుకోవడంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఆ దీవి మాకు కావాలంటే మాకు కావాలని రెండు దేశాలు మళ్లీ వాదించుకున్నాయి. ఇందుకోసం ఇరుదేశాల రాయబారుల మధ్య చర్చలు జరిగాయి. దాదాపు 11 ఏళ్లు ఈ దీవి కోసం చర్చలు జరిపినప్పటికీ ఒక ఒప్పందానికి రాలేకపోయాయి.దీంతో ఏళ్ల తరబడి జరుగుతున్న చర్చను కొలిక్కి తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చాయి.

ఆ దీవిని చెరో ఆరు నెలలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందానికి గుర్తుగా ఆ ద్వీపానికి శ్వాపింగ్ ఐలాండ్‌గా మార్చాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ ద్వీపం ప్రతి ఏడాది ఫిబ్రవరి 1 నుంచి జూలై 31 వరకు స్పెయిన్ ఆధీనంలో ఉంటుంది. ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఫ్రాన్స్ చేతిలోకి వెళ్తుంది. ఇలా ద్వీపాన్ని మార్చుకునే సమయంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

Parineeti Chopra | ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌.. సౌత్‌ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం బతిమిలాడుతున్న బాలీవుడ్‌ బ్యూటీ

ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.. ఏడు నెలలు కాకుండానే తనువు చాలించాడు..

Exit mobile version