Home Entertainment Parineeti Chopra | ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌.. సౌత్‌ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం బతిమిలాడుతున్న...

Parineeti Chopra | ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌.. సౌత్‌ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం బతిమిలాడుతున్న బాలీవుడ్‌ బ్యూటీ

Parineeti Chopra | బాలీవుడ్‌ అంటే మన దేశంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ. అక్కడి వాళ్లు టాలీవుడ్‌తో పాటు సౌత్‌ సినిమాలను చాలా చిన్నచూపు చూసేవాళ్లు. వీళ్లకు అసలు సినిమాలు తీయడం వచ్చా అన్న రేంజ్‌లో బిల్డప్‌ ఇచ్చేవాళ్లు. కానీ అది అప్పుడు. ఇప్పడు పరిస్థితులు పూర్తిగా తలకిందులు అయ్యాయి. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లాడు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. బాహుబలి తర్వాత పక్కనే ఉన్న శాండిల్‌వుడ్‌ నుంచి చిన్న సినిమాగా వచ్చిన కేజీఎఫ్‌ ప్రభంజనం సృష్టించింది. దీని తర్వాత హిందీ ఆడియన్స్‌ దృష్టి మొత్తం సౌత్‌ సినిమాలపై పడింది. అదే సమయంలో వరుసగా ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప, కార్తికేయ2, కాంతార వంటి సినిమాలకు అక్కడి జనాలు ఫిదా అయిపోయారు. దీంతో హిందీ ఆడియన్స్‌కు బాలీవుడ్‌ సినిమాలు పెద్దగా రుచించడం లేదు. అందుకే ఈ మధ్య బాలీవుడ్‌లో వచ్చిన ఏ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నది. ఇదిలా ఉంటే ఒకప్పుడు సౌత్‌ ఇండస్ట్రీని చిన్నచూపు చూసిన బాలీవుడ్ స్టార్స్‌ ఇక్కడ నటించేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

ఇప్పటికే ఆలియా భట్‌, కియారా అద్వానీ, అనన్య పాండే తెలుగు సినిమాల్లో నటించగా.. జాన్వీకపూర్‌ వంటి యంగ్‌ హీరోయిన్స్‌ సౌత్‌ ఇండస్ట్రీలో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. సౌత్‌ సినిమాల్లో నటించాలని ఆసక్తిగా ఉందని ఇప్పటికే జాన్వీ కపూర్‌ ప్రకటించింది. జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేయడం తన కల అని చెప్పింది. తమిళంలో విజయ్‌ సేతుపతి సినిమాలో ఛాన్స్‌ కూడా అడిగానని బయటపెట్టింది. ఇప్పుడు ఈమెలాగే మరో బాలీవుడ్‌ బ్యూటీ సౌత్‌ సినిమాల్లో ఛాన్స్‌ కోసం వెంపర్లాడుతోంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా.

సౌత్‌ సినిమాల్లో అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. తెలుగు అనే కాదు తమిళం, కన్నడ, మలయాళ ఏదైనా సరే సౌత్‌ ఇండస్ట్రీలో నటిస్తానని పేర్కొంది. ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్‌తక్‌ 2022 కార్యక్రమంలో ఈ విషయాన్ని పరిణీతి చోప్రా చెప్పింది. బాలీవుడ్‌లో అవకాశాలు లేక పరిణీతి ఇలా అనుకుంటే పొరపాటే. బాలీవుడ్‌లో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ ఏడాది తిరంగా, ఊంఛల్‌ సినిమాలో వచ్చింది. ప్రస్తుతం క్యాప్సుల్‌ గిల్‌ అనే బాలీవుడ్‌ మూవీలో నటిస్తోంది. అక్కడ ఆఫర్లు వస్తుండగా పరిణీతి.. సౌత్‌ సినిమాల్లో అవకాశాల కోసం బతిమిలాడుతుంది. ఇందుకు కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా. సౌత్‌ సినిమాల్లో నటిస్తే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ తెచ్చుకోవచ్చు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sushant singh rajput | సుశాంత్‌ మరణించిన ఫ్లాట్‌ అంటేనే భయపడిపోతున్నారట.. అందుకే రెండున్నరేళ్లయినా ఖాళీగానే ఉంది

Dhanya Balakrishna | పెళ్లయిన డైరెక్టర్‌తో సీక్రెట్‌గా కాపురం పెట్టిన ధన్య బాలకృష్ణ.. నటి కామెంట్స్‌ వైరల్‌

Dhanya Balakrishna | పెళ్లయిన డైరెక్టర్‌తో సీక్రెట్‌గా కాపురం పెట్టిన ధన్య బాలకృష్ణ.. నటి కామెంట్స్‌ వైరల్‌

Vishal Marriage | ప్రభాస్‌ పెళ్లి చేసుకున్న రోజే.. నేనూ చేసుకుంటా.. విశాల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Exit mobile version