Home Entertainment Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Kaikala Satyanarayana | కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్ ( KGF ) సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా రిలీజయ్యాక అందరూ రాఖీభాయ్ క్రేజ్‌లో పడిపోయారు. వందల కోట్లు వసూలు చేసిన ఈ సినిమాతో కైకాల సత్యనారాయణకు సంబంధం ఉంది. అదేంటి ఈ సినిమాలో సత్యనారాయణ ఎక్కడ ఉన్నారని అనుకుంటున్నారా? నిజమే సినిమాలో కైకాల సత్యనారాయణ నటించలేదు. కానీ సినిమా టైటిల్స్ పడేముందు కైకాల సత్యనారాయణ సమర్పించు అని వస్తుంది. అదేంటి కన్నడ సినిమా ముందు కైకాల పేరు ఎందుకు వేశారానే అనుమానం వస్తుంది కదూ.. దీని వెనుక కారణం ఉంది. అదేంటంటే..

విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రల్లో మెప్పించిన కైకాల సత్యనారాయణ నిర్మాణ రంగంలోనూ తన సత్తా చాటాడు. రమా ఫిలింస్ బ్యానర్ స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. కైకాల తర్వాత ఆయన వారసుడు కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. శాండిల్‌వుడ్‌లో పలు సినిమాలు నిర్మించాడు. కేజీఎఫ్ చిత్రానికి హోంబలే ప్రొడక్షన్‌తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ టైమ్‌లోనే కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనా వేసిన కైకాల కుమారుడు.. తెలుగు రైట్స్ తీసుకోవాలని అనుకున్నాడు. అయితే ఒక్కడే తెలుగులో రిలీజ్ చేస్తే అంతగా మార్కెట్ అవుతుందో లేదోనని భావించి.. సాయి కొర్రపాటి తోడు తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి తెలుగులో కేజీఎఫ్ సినిమాను రిలీజ్ చేశారు. అందుకే ఈ సినిమాకి ముందు కైకాల సత్యనారాయణ సమర్పించు అని వస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కేజీఎఫ్ చాప్టర్ 1 తెలుగులో దాదాపు 18 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణకు కేజీఎఫ్ యూనిట్ సన్మానం చేసింది.

కైకాల సత్యనారాయణ 1983లో రమా ఫిలిం ప్రొడక్షన్ స్థాపించి తన తమ్ముడు నాగేశ్వరరావుతో కలిసి ఇద్దరు దొంగలు అనే సినిమా తీశాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా నటించారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత గజదొంగ, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి చిత్రాలను తీశాడు. ఈ చిత్రాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kaikala satayanarayana | టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు కైకాల కన్నుమూత

Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

Kaikala Satyanarayana | కైకాల సత్యనారాయణ కోరికతో లక్షలు పోగొట్టుకున్న రామానాయుడు

Exit mobile version