Home Entertainment Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

Kaikala Satyanarayana | తెలుగు ఇండస్ట్రీలో విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కైకాల సత్యనారాయణ. ఏ పాత్ర ఇచ్చిన సరే అవలీలగా చేసేస్తాడు. అందుకే కైకాలను నవరస నటసార్వభౌముడు అని పిలుస్తారు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో విలన్‌గా మెప్పించాడు. టాలీవుడ్‌లో నంబర్ వన్ విలన్‌గా కొంతకాలం వెలుగువెలిగాడు. కానీ కైకాల సినీ ఇండస్ట్రీకి విలన్ అవుదామని రాలేదు. హీరో అవ్వాలని వచ్చాడు. ఫస్ట్ ఛాన్స్ కూడా హీరోగానే వచ్చింది. సిపాయి కూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అది ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఆ తర్వాత ఒకటి అరా సినిమాల్లో హీరో పాత్రలే పోషించినా అవి కూడా అవి అంతగా సక్సెస్ కాలేదు. అవకాశాలు తగ్గిపోయాయి. అప్పుడు విలన్‌గా మారితే మంచి భవిష్యత్తు ఉంటుందని విఠలాచార్య ( vittalacharya ) సలహా ఇచ్చాడు.

హీరో అనగానే చాలా కాంపిటీషన్ ఉంటుంది. మీ వెనకాల మీకు బ్యాక్‌గ్రౌండ్ హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు విలన్స్ కొరత ఉంది. ఆ పాత్రలు చేయడానికి ఎవరూ లేరు. లైమ్‌లైట్‌లో ఉన్న ఆర్.నాగేశ్వరరావు మరణించారు. మక్కమాల ఏజ్ అయిపోయింది. ఒక్క రాజనాల మాత్రమే ఉన్నారు. మీరెందుకు విలన్‌గా మారకూడదు. దేనికైతేనేం.. విలన్‌గా వేషాలు వేసేవాళ్లకు పేరు రావట్లేదా. నా మాట విని విలన్‌గా ట్రై చేయండి అని కైకాలకు విఠలాచార్య సలహా ఇచ్చాడు. అంతేకాదు నేనే ఫస్ట్ ఛాన్స్ ఇస్తానంటూ తన కనకదుర్గ మహిమ సినిమాలో విలన్‌గా అవకాశం ఇచ్చాడు. అప్పట్నుంచి అప్పుడప్పుడు క్యారెక్టర్‌లు ఇస్తూ వచ్చాడు. అలా ఎన్టీఆర్‌తో అగ్గిపిడుగు అనే సినిమాలో విఠలాచార్య అవకాశం ఇచ్చాడు.

అది కార్నికన్ బ్రదర్స్ అనే ఇంగ్లిష్ చిత్రానికి రీమేక్. ఇందులో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్. ఒక రామారావుకు అపోజిట్‌గా రాజనాల. ఇంకో రామారావుకు విలన్‌గా కైకాల నటించాడు. అప్పట్లో సినీ ఇండస్ట్రీలో ఒక ఆనవాయితీ ఉండేది. సినిమా అయిపోగానే ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు, రిపోర్టర్లకు ప్రివ్యూ వేసేవాళ్లు. అలా అగ్గిపిడుగు సినిమాకు ప్రివ్యూ వేశారు. అప్పటికి చిన్న సినిమాలు చేసే విఠలాచార్య ఎన్టీఆర్‌తో సినిమా చేయడం.. అది కూడా తక్కువ టైమ్‌లో కంప్లీట్ చేయడంతో సినిమా ప్రివ్యూ కోసం చాలామంది వచ్చారు. దీంతో తక్కువ టైమ్‌లోనే కైకాల అందరి దృష్టిలో పడిపోయాడు. అప్పట్నుంచి ఎన్టీఆర్ సినిమా అంటే కైకాల సత్యనారాయణ విలన్ అనేంతగా పేరు తెచ్చుకున్నాడు. అలా తెలుగు ఇండస్ట్రీలో నంబర్ వన్ విలన్‌గా ఎదిగాడు.

విలన్‌గా కొనసాగుతున్న టైమ్‌లో ఒకటే పాత్రకు పరిమితం కావద్దని భావించాడు కైకాల సత్యనారాయణ. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం కూడా మొదలుపెట్టాడు. అలా అన్నగా, తండ్రిగా, తాతగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించాడు. నవరస నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్నాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kaikala satayanarayana | టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు కైకాల కన్నుమూత

Exit mobile version