Home Entertainment Dasara Movie Business | నాని మార్కెట్‌కు మించి దసరా బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాల్లో...

Dasara Movie Business | నాని మార్కెట్‌కు మించి దసరా బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాల్లో నిర్మాతలు..!

Dasara Movie Business | అప్పుడెప్పుడో వరుసగా ఎనిమిది హిట్లు సాధించి రికార్డుల్లోకెక్కిన నానికి.. ఆ తర్వాత కమర్షియల్ హిట్టే కరువైంది. MCA తర్వాత నాని నుంచి వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్ హిట్టు సాధించలేదు. అయితే నాని సినిమాలకు టాక్ బాగానే వస్తున్నా కమర్షియల్ గా విజయాలు సాధించలేకపోతున్నాయి. నేషనల్ అవార్డు సైతం గెలిచిన జెర్సీ కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు జస్ట్ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నాయి. కానీ నాని రేంజ్‌కు తగ్గ హిట్లు మాత్రం కాలేకపోయాయి. ఇక గతేడాది వచ్చిన అంటే సుందరానికి నాని కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ క్రమంలో నాని తన కంఫర్ట్ జోనర్ నుంచి బయటకు వచ్చి దసరా వంటి మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతూ దసరా సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇటీవలే రిలీజైన టీజర్ వరకు ప్రతీది శ్రీకాంత్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంలా అనిపించాయి. అసలు నాని వంటి ఫ్యామిలీ హీరోను ఇలాంటి లుక్ లో చూపించి మొదటి అడుగులో అందరితో శభాష్ అనిపించుకున్నాడు. నానిలోని నటుడిని మారుతి, గౌతమ్ వంటి ఒకరిద్దరు మినహాయించి ఎవ్వరూ పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోలేదు. కానీ, శ్రీకాంత్ మాత్రం ఈ సినిమా కోసం నాని నుంచి కాస్త ఎక్కువ జుర్రుకున్నాడు. టీజర్ లోని చివరి షాట్ ఒక్కటి చాలు ఈ సినిమాలో నాని నటన ఏ స్థాయిలో ఉండబోతుందో అని ఊహించడానికి. ఆ ఒక్క టీజర్ సినిమాపై ఎక్కడ లేని క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే నిర్మాతల పాలిట లక్ష్మీదేవిలా కనకవర్షం కురిపిస్తుంది. టాలీవుడ్‌లో నడుస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు అన్ని హక్కులు కలుపుకుని ఏకంగా రూ.80 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తుంది.

మొన్నటి వరకు నాని మార్కెట్ రూ.30 కోట్లు. నిజానికి నాని గత ఐదారు సినిమాలు కనీసం రూ.25 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు దసరాకు ఏకంగా రూ.80 కోట్ల బిజినెస్ జరిగిందంటే వండర్ అనే చెప్పాలి. ముందుగా ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ రూ.30 కోట్లు. కానీ సినిమా పూర్తయ్యే సరికి ఖర్చు డబుల్ అయింది. అంటే నాని మార్కెట్ వాల్యూకు రెట్టింపు బడ్జెట్ అయింది. నాని మార్కెట్ ను లెక్కచేయకుండా ఇంత డబ్బు పెట్టారంటే నిర్మాతలకు ఈ సినిమాపై ఉన్న నమ్మకం ఎలాంటిదో తెలుస్తుంది. ఆ నమ్మకమే ఇప్పుడు రిలీజ్ కు ముందే రూ.15 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు ఉన్న బజ్ ను బట్టి చూస్తే నాని కెరీర్‌లో హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే మూవీ ఇదే అయ్యే అవకాశం లేకపోలేదు. పైగా పోటీగా ఎలాంటి సినిమా లేకపోవడంతో కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా వంద కోట్ల బొమ్మ అవుతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Kirak RP | నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ బాగోలేదంటూ టాక్.. సీరియస్ అయిన కిరాక్ ఆర్పీ

Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా

Bhanupriya | మెమొరీ లాస్‌తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్‌లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట

Jabardasth Varsha | రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. వీడియో పోస్టు చేసిన జబర్దస్త్ వర్ష.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Allu Aravind | ఆమెకు ఆ అవసరం లేదు.. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sundeep Kishan | రెజీనాతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్

Exit mobile version