Home Entertainment Bhanupriya | మెమొరీ లాస్‌తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్‌లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట

Bhanupriya | మెమొరీ లాస్‌తో బాధపడుతున్న సీనియర్ హీరోయిన్.. సెట్స్‌లో డైలాగులు కూడా గుర్తుండట్లేదట

Bhanupriya | భానుప్రియ ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేవి ఆమె పెద్ద పెద్ద కళ్లు. నెమలిలా ఆమె చేసే నాట్యం అందరి కళ్ల ముందు కదలాడుతుంది. 80వ దశకంలో అందరి అగ్రహీరోల సరసన భానుప్రియ నటించింది. తరువాత ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గానూ రాణించింది. అమ్మ పాత్రల్లో జీవించింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గతేడాది వరకు వరుస సినిమాలు చేసిన భానుప్రియ.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. దీనికి గల కారణాలను తాజాగా భానుప్రియ వివరించింది. తాను బాధపడుతున్న అనారోగ్య సమస్య గురించి బయటపెట్టింది.

ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ.. కొంతకాలం క్రితం తనభర్త చనిపోయారని.. అప్పటి నుంచి తన ఆరోగ్యం సరిగా లేదని వెల్లడించింది. తన మెమొరీ కూడా తగ్గిపోయిందని చెప్పింది. ఇటీవల సిల నేరంగిలిల్ సిల మనిధర్గల్ అనే తమిళ సినిమాలో నటించానని.. లొకేషన్‌కు వెళ్లగానే డైలాగ్స్ అన్నీ మర్చిపోయానని తెలిపింది. యాక్షన్ చెప్పిన తర్వాత అలాగే ఉండిపోయానని పేర్కొంది. తాను మళ్లీ సర్దుకునే దాక ఆగి ఈ సీన్స్ షూట్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. గతంలో ఒక డ్యాన్స్ స్కూల్ పెడదామని అనుకున్నప్పటికీ.. జ్ఞాపకశక్తి తగ్గడంతో నృత్య భంగిమలు, ముద్రలు చాలావరకు మరిచిపోయానని తెలిపింది. దీంతో డ్యాన్స్‌పై ఆసక్తి కూడా పోయిందని పేర్కొంది. ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయడం లేదని వెల్లడించింది. ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే ఇలా అన్నీ మరిచిపోతున్నానని వెల్లడించిన భానుప్రియ.. ఎలాంటి డిప్రెషన్‌కు గురికావడం లేదని.. ఒత్తిళ్లు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Jabardasth Varsha | రాత్రికి రాత్రే ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు.. వీడియో పోస్టు చేసిన జబర్దస్త్ వర్ష.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

TP Gajendran | ప్రముఖ కమెడియన్‌, సీఎం స్టాలిన్‌ స్నేహితుడు కన్నుమూత.. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన మర్నాడే..

Sundeep Kishan | రెజీనాతో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్

Vani Jairam | టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ వాణీ జయరాం కన్నుమూత!

Vani Jairam | వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు…పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాతే ఓ క్లారిటీ!

Vani Jairam | వాణీ జయరాం కుటుంబ నేపథ్యం తెలుసా.. ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది!

Exit mobile version