Home Entertainment Veera Simha Reddy Trailer | ఏపీ సీఎం జగన్‌కు బాలయ్య కౌంటర్‌.. వీరసింహరెడ్డి ట్రైలర్‌లో...

Veera Simha Reddy Trailer | ఏపీ సీఎం జగన్‌కు బాలయ్య కౌంటర్‌.. వీరసింహరెడ్డి ట్రైలర్‌లో విశ్వరూపం చూపించాడుగా..

Veera Simha Reddy Trailer | నందమూరి బాలకృష్ణ లేటెస్ట్‌ చిత్రం వీరసింహారెడ్డి. అఖండ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత సంక్రాంతికి సినిమా రావడం.. పైగా మెగాస్టార్‌ చిరంజీవితో బాక్సాఫీసు దగ్గర పోటీ పడుతుండటంతో సినీ అభిమానులంతా ఈసినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాపై హైప్‌ పెంచుతూ సినిమా ట్రైలర్‌ను లాంఛ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వీరసింహారెడ్డి ట్రైలర్‌ను లాంఛ్‌ చేశారు.
ఇందులో బాలకృష్ణను పవర్‌ఫుల్‌ ఫ్యాక్షనిస్ట్‌గా చూపించాడు గోపిచంద్‌ మలినేని. ఒకవైపు స్టైలిష్‌గా కనిపిస్తూనే.. తన మార్క్‌ పంచ్‌ డైలాగులతో బాలయ్య ఆకట్టుకున్నాడు. సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తిపట్టా, నాది ఫ్యాక్షన్‌ కాదు.. సీమ మీద ఎఫెక్షన్‌ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. పనిలో పనిగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి కూడా ఇన్‌డైరెక్ట్‌గా బాలయ్య పంచ్‌లు విసిరాడు. సంతకాలుపెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేరు అంటూ సెటైర్‌ వేశాడు. ఎప్పటిలాగే సాంగ్స్‌లు, డ్యాన్సుల్లోనూ బాలయ్య ఇరగదీశాడు.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో వస్తున్న వీరసింహరెడ్డి సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. శృతిహాసన్‌ ఈ సినిమాలో కథానాయిక. ధునియా విజయ్‌ ప్రతినాయకుడిగా నటించాడు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, హనీ రోజ్‌ కీలక పాత్రల్లో నటించారు.

Follow Us : Google News, FacebookTwitter

Read more Articles:

Pavitra Naresh | పవిత్ర, నరేశ్‌ పెళ్లి జరగనివ్వను.. సీన్‌లోకి వచ్చేసిన మూడో భార్య రమ్య రఘుపతి

Varisu Art Director Sunil Babu | వారిసు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు మృతి.. సినిమా రిలీజ్‌కు వారం ముందు విషాదం

Tamannah Bhatia | అమ్మో ! తమన్నా సినిమాల్లోకి వచ్చి అన్ని కోట్లు సంపాదించిందా?

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Sharwanand | తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ లవ్ మ్యారేజి.. వధువు ఏం చేస్తుందంటే..

Exit mobile version