Home Entertainment Pavitra Naresh | పవిత్ర, నరేశ్‌ పెళ్లి జరగనివ్వను.. సీన్‌లోకి వచ్చేసిన మూడో భార్య రమ్య...

Pavitra Naresh | పవిత్ర, నరేశ్‌ పెళ్లి జరగనివ్వను.. సీన్‌లోకి వచ్చేసిన మూడో భార్య రమ్య రఘుపతి

Pic Credit : Mana stars

Pavitra Naresh | సీనియర్‌ నటుడు నరేశ్‌ ( Naresh ), పవిత్ర లోకేశ్‌ పెళ్లి విషయం ఇప్పుడే తేలేటట్టు కనిపించడం లేదు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేశ్‌.. మూడో భార్య రమ్య రఘుపతికి ఇంకా విడాకులు ఇవ్వలేదు. అప్పుడే నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ వీళ్ల పెళ్లి జరనివ్వనని పంతంపూనింది మూడో భార్య రమ్య రఘుపతి ( Ramya Raghupathi ). నరేశ్‌కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్య రఘుపతి స్పష్టం చేసింది.

ఈ ఇంటర్వ్యూలో నరేశ్‌కు సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టింది. నరేశ్‌ నీచుడని.. అతను చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదని చెప్పుకొచ్చింది. తనను వదిలించుకోవడానికి ఎంతగానో వేధించేవాడని తెలిపింది. డ్రైవర్‌తో, రాఖీ కట్టిన అన్నతో తనకు ఎఫైర్‌ ఉందని అనుమానించేవాడని పేర్కొంది. దేవుడులాంటి కృష్ణతో తనకు అక్రమ సంబంధం అంటగట్టాడని తెలిపింది. తన నుంచి కృష్ణ గారికి ప్రాణహాని ఉందని ఒక నకిలీ లెటర్‌ సృష్టించి తనపై కేసు వేశాడని పేర్కొంది. ఈ విషయం కృష్ణకు కూడా తెలియదని తెలిపింది. దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పింది. కృష్ణపై ఉన్న మర్యాదతోనే ఇన్ని రోజులు ఈ విషయాలు బయటపెట్టలేదని పేర్కొంది. కానీ నరేశ్‌ దారుణాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. పవిత్రను ఫస్ట్‌ టైమ్‌ పరిచయం చేసినప్పుడు తన చేత్తో అన్నం పెట్టానని.. ఇప్పుడు ఆమె తనకు సున్నం పెడుతుందని తెలిపింది. ఏదేమైనా వాళ్లిద్దరి పెళ్లి జరగనివ్వనని స్పష్టం చేసింది.

నరేశ్‌కు ఏదో రోజు సెల్ఫ్‌ రియలైజేషన్‌ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నానని ఈ సందర్భంగా రమ్య రఘుపతి పేర్కొంది. తప్పు చేసి ఆ తర్వాత వచ్చి సారీ చెప్పడం, ఏడ్వడం, కాళ్లు పట్టుకోవడం నరేశ్‌కు అలవాటేనని చెప్పుకొచ్చింది. తన కొడుక్కి డివొర్స్‌ అనే మాటే తెలియదని.. నాన్న వేరే పెళ్లి చేసుకుంటున్నాడా? అని తనను వచ్చి అడుగుతున్నాడని ఎమోషన్‌ అయ్యింది. తన కొడుకు నాన్న కావాలని అడుగుతున్నాడని.. వాడికోసమైనా విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. రమ్య రఘుపతి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ వ్యవహారం కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇద్దరూ కలిసి ఓ ప్రైవేటు హోటల్‌లో రమ్య రఘుపతికి అడ్డంగా దొరికిపోవడంతో వీళ్లిద్దరూ టాలీవుడ్‌లో ట్రెండింగ్‌గా మారారు. మొన్నటికి మొన్న సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణించినప్పుడు కూడా వీళ్లే హైలెట్‌ అయ్యారు. ఆ రోజు నరేశ్‌ చూపించిన అత్యుత్సాహం విమర్శలకు దారితీసింది. దీంతో ఎప్పటికప్పుడు నరేశ్‌, పవిత్రల మీద సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వస్తూనే ఉన్నాయి. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు సిద్ధమైన నరేశ్‌.. పవిత్రను పెళ్లిచేసుకోబోతున్నానని న్యూ ఇయర్‌ సందర్భంగా ప్రకటించాడు. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ఓ వీడియోను పోస్టు చేశాడు. కానీ ఇప్పుడు వీళ్ల పెళ్లి జరగనివ్వనని నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతి గట్టిగానే చెబుతోంది. మరీ పవిత్ర నరేశ్‌ పెళ్లి మ్యాటర్‌ ముందు ముందు ఏమవుతుందో చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Hit 2 Ott Release | అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ‌కు షాక్.. ఓటీటీలో నుంచి హిట్ 2 తొలగింపు

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

NTRforOscars | ఈ క్రేజ్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం పక్కా అన్నట్టే

Sharwanand | తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ లవ్ మ్యారేజి.. వధువు ఏం చేస్తుందంటే..

Exit mobile version