Home Lifestyle Health Heart attack | గుండెపోటు అని అనుమానం వస్తే ఈసీజీతో పాటు ఈ పరీక్షలు ఎందుకు...

Heart attack | గుండెపోటు అని అనుమానం వస్తే ఈసీజీతో పాటు ఈ పరీక్షలు ఎందుకు చేస్తారు ?

Heart attack | సాధారణంగా గుండెపోటు అని అనుమానం రాగానే ఈసీజీ తీయిస్తే తెలిసిపోతుంది. కానీ గుండెకు సంబంధించిన అన్ని వివరాలు ఈసీజీలో బయటపడవు. అందుకే గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులు ఈసీజీ తీసి.. దాన్ని ధృవీకరించుకునేందుకు మరిన్ని పరీక్షలు చేస్తారు. ఇంతకీ ఏంటవి?

ఈసీజీ..

ఈసీజీలో 80-90 శాతం గుండెపోటు నిర్ధారణ అవుతుంది. గతంలో వచ్చిన విషయం కూడా ఈసీజీలో తెలిసిపోతుంది. కాకపోతే.. ఒక్కోసారి గుండెపోటుతో కలిగే మార్పులు ఈసీజీలో పూర్తిస్థాయిలో వెంటనే నమోదు కావు. అలాంటివి తెలుసుకోవాలంటే గుండెపోటు వచ్చిన 45 నిమిషాల తర్వాత రెండు మూడు సార్లు ఈసీజీ తీయాలి. అప్పుడే అందులో మార్పులు గమనించవచ్చు. ఒకవేళ ఎలాంటి మార్పులు లేవంటే గుండెపోటు రాలేదని 99శాతం నిర్ధారించవచ్చు. కొన్నిసార్లు మాత్రం గుండెపోటు వచ్చిన విషయం ఈసీజీలో కూడా తెలియదు. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటివి జరుగుతాయి.

Read More: World’s Deadliest Diseases | ప్రపంచాన్ని భయపెట్టిన 6 అతిపెద్ద మహమ్మారులు.. టెక్నాలజీ, వైద్యులు, పరిశోధనలు లేకున్నా ఎలా అంతమయ్యాయి ?

ఎకో పరీక్ష

సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు గుండె కండరాల్లో, స్పందనల్లో మార్పులు వస్తాయి. వాటిని ఎకో పరీక్ష ద్వారా కండరాల్లో, స్పందనల్లో మార్పులను గుర్తించొచ్చు. అయితే ఈసీజీతో పోలిస్తే ఖర్చుతో కూడుకున్న పరీక్ష. అంతేకాదు.. కార్టియాలజిస్టులు మాత్రమే ఎకో పరీక్ష చేయాలి.

యాంజియోగ్రామ్‌..

ఎకో పరీక్ష, ఈసీజీలో గుర్తించకపోయినా గుండెపోటును కచ్చితంగా నిర్ధారించగలిగే పరీక్ష యాంజియోగ్రామ్‌. గుండె రక్తనాళాల పరిస్థితి, రక్తనాళాల్లో ఏవైనా బ్లాకులు ఉన్నాయా అనే విషయాన్ని యాంజియోగ్రామ్ ద్వారా కచ్చితంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా గుండెపోటును కచ్చితంగా గుర్తించే వీలుంటుంది.

ట్రోపోనిన్‌ పరీక్ష

సాధారణంగా గుండెపోటు వచ్చినప్పుడు రక్తంలో ట్రోపోనిన్‌ ప్రోటీన్ల మోతాదు పెరిగిపోతుంది. కాబట్టి ఈ పరీక్షలో ట్రోపోనిన్‌ మోతాదు పెరిగి.. ఈసీజీలోనూ తేడాలున్నట్లైతే కచ్చితంగా గుండెపోటు అని నిర్ధారించొచ్చు. యాంజియోగ్రామ్‌, ఎకో పరీక్షలతో పోలిస్తే దీనికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Home Remedies for Cold | చలికాలంలో ముక్కు కారుతుందా? ఈ చిట్కాలతో జలుబు నుంచి ఉపశమనం పొందండి

Bone Health | ఎముకలు బలంగా కావాలంటే.. రోజూవారీ భోజనంలో వీటిని తప్పనిసరి చేసుకోవాలి!

Health Tips | రక్తహీనతతో బాధపడుతున్నారా.. ఇదిగో ఇవి తింటే మీ సమస్య తీరినట్టే!

Is eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?

Exit mobile version