Home Entertainment Varisu Art Director Sunil Babu | వారిసు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు మృతి.....

Varisu Art Director Sunil Babu | వారిసు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు మృతి.. సినిమా రిలీజ్‌కు వారం ముందు విషాదం

Image Source : Instagram/anjalimenonfilms/

Varisu Art Director Sunil Babu | సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు (50) గుండెపోటుతో మృతిచెందాడు. తమిళనాడు ఎర్నాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచాడు.

కేరళలోని పథానంతిట్టలోని మల్లాపల్లికి చెందిన సునీల్ బాబు.. మైసూర్ ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తికాగానే సబు సిరిల్ దగ్గర అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2005లో ఆనందభ్రదం అనే మలయాళ సినిమాతో ఆర్ట్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా కేరళ స్టేట్ ఫిలిం అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ఉరిమి, చోటా ముంబై, బెంగళూరు డేస్, ప్రేమమ్ వంటి ఎన్నో మలయాళ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. బాలీవుడ్‌లో ఎంఎస్ ధోని, గజిని, లక్ష్య, స్పెషల్ 26 చిత్రాలకు పనిచేశాడు.

తెలుగులో ఊపిరి, మహర్షి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలతో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాకు కూడా సునీల్ బాబు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. చివరగా తలపతి విజయ్ వారిసు సినిమాకు ఆయన పనిచేశాడు. ఈ సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందే సునీల్ బాబు మృతిచెందడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సునీల్ బాబు మృతి గురించి తెలిసి పలువురు సెలబ్రెటీలు సంతాపం తెలుపుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Tamannah Bhatia | అమ్మో ! తమన్నా సినిమాల్లోకి వచ్చి అన్ని కోట్లు సంపాదించిందా?

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Hit 2 Ott Release | అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ‌కు షాక్.. ఓటీటీలో నుంచి హిట్ 2 తొలగింపు

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

NTRforOscars | ఈ క్రేజ్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం పక్కా అన్నట్టే

Sharwanand | తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ లవ్ మ్యారేజి.. వధువు ఏం చేస్తుందంటే..

Exit mobile version