Home Latest News Delhi Accident Case | ఢిల్లీ యాక్సిడెంట్‌ కేసులో మరో ట్విస్ట్‌.. వెలుగులోకి సంచలన విషయం..

Delhi Accident Case | ఢిల్లీ యాక్సిడెంట్‌ కేసులో మరో ట్విస్ట్‌.. వెలుగులోకి సంచలన విషయం..

Delhi Accident Case | కొత్త సంవత్సరం వేళ ఢిల్లీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. స్కూటర్‌పై అంజలి మాత్రమే వెళ్తుండగా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిందని మొదటి రోజు అనుకున్నారు. కానీ ఆమెతో మరో స్నేహితురాలు నిధి కూడా ఉందని రెండు రోజుల తర్వాత బయటపడింది. ఆ తర్వాత ఇద్దరూ బండి తాళం గురించి గొడవపడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరో విషయం బయపడింది.

అంజలి, నిధి ఇద్దరూ బండి తాళం కోసం గొడవపడలేదని.. డబ్బుల కోసం గొడవ పడ్డారని అంజలి స్నేహితుడు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. యాక్సిడెంట్‌ జరిగే కంటే ముందు అంజలి తనకు ఏడుసార్లు ఫోన్‌ చేసిందని, లిఫ్ట్‌ చేయకపోవడంతో ఇంటికి మరో స్నేహితుడిని పంపించిందని ఆ యువకుడు వెళ్లడించాడు. కచ్చితంగా రావాలని బలవంతం చేయడంతో రాత్రి 11.30 గంటలకు హోటల్‌కు వెళ్లినట్లు చెప్పాడు.

అప్పటికే అక్కడ నిధి, అంజలీ పార్టీ చేసుకుంటున్నారని, మరో ఇద్దరు కూడా అక్కడ ఉన్న విషయం బయటపెట్టాడు. హోటల్‌లో రెండు రూములు బుక్‌ చేశారని, వారు బీరు తాగుతూ ఎంజాయ్‌ చేశారని పేర్కొన్నాడు. తర్వాత కాసేపటికే అంజలి, నిధి మధ్య డబ్బుల కోసం గొడవ జరిగిందని, తన డబ్బులు తనుకు ఇవ్వాలని అంజలితో నిధి గొడవకు దిగిందని వివరించాడు. ఇద్దరూ కలబడటంతో తాను అక్కడున్న వాళ్లతో కలిసి వేరు చేశామని, కాసేపటికే నిధి, అంజలీ బండిమీద వెళ్లిపోయారని జాతీయ మీడియా ఇండియా టుడేతో మాట్లాడుతూ పూసగుచ్చినట్లు వివరించాడు. అయితే అంజలి ప్రమాదం గురించి తనకు తర్వాతి రోజు సాయంత్రం తెలిసిందని యువకుడు వివరించాడు.

Follow Us : Google News, FacebookTwitter

Read more Articles:

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు ? ఆలయ విశేషాలేంటి.. శిల్పులు ఎవరు ?

Fungus Infections | భారత్‌లో 5.7కోట్ల మందికి ఫంగస్ ముప్పు.. 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ఛాన్స్.. అధ్యయనంలో సంచలన విషయాలు

Amit shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమానం గువాహటిలో అత్యవసర ల్యాండింగ్

Rishabh Pant | రిషభ్ పంత్ ముంబైకి తరలింపు.. మెరుగైన వైద్య చికిత్స కోసమేనన్న ఢిల్లీ క్రికెట్ బోర్డు.. అవసరమైతే లండన్‌కు

Biplab Kumar Deb | త్రిపురలో దారుణం.. మాజీ ముఖ్యమంత్రి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు.

Exit mobile version