Friday, March 31, 2023
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 06-03-2023 )

Horoscope Today | రాశిఫలాలు ( 06-03-2023 )

Horoscope Today | మేషం

రహస్య విషయాలు గ్రహిస్తారు. పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. స్వల్ప ధనలాభం ఉంది.

వృషభం

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొంత ప్రోత్సాహం లభిస్తుంది. వివాహయత్నాలు సాగిస్తారు. నూతన విద్యలపై ఆసక్తి పొందుతారు.

మిథునం

సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఉన్నత హోదాలు అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన వస్తువులు సేకరిస్తారు.

కర్కాటకం

కళలు, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లోని వారికి సన్మానాలు, సత్కారాలు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. నూతన ఉత్సాహంతో ముందుడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఏర్పడతాయి. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

సింహం

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరతాయి. కుటుంభసభ్యులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు.

కన్య

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.

తుల

సన్నిహితుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాటపట్టింపులు పరిష్కరించుకుంటారు. కొన్ని పనుల్లో అవాంతరాలు ఏర్పడినా అధిగమించి ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

ధనుస్సు

ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. పనుల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వస్తువులు సేకరిస్తారు.

మకరం

గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధన లాభం పొందుతారు.

కుంభం

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

మీనం

ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు పెరిగి కొ్తత కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News