Tuesday, May 28, 2024
- Advertisment -
HomeNewsInternationalAmerica Vs China | హీటెక్కిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. చైనాపై నిక్కీ హేలీ కీలక...

America Vs China | హీటెక్కిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. చైనాపై నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు!

America Vs China | అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండేందుకు నేతలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో రిపబ్లికన్‌ నేత, ఇండో అమెరికన్‌ అయిన నిక్కీ హేలీ.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవలే అమెరికా ప్రపంచ ఏటీఎం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. తాజాగా చైనాను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు.

అమెరికా ఇప్పటి వరకు ఎదుర్కొన్న అత్యంత బలమైన, క్రమశిక్షణ కలిగిన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చైనా మాత్రమే అని వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌ లో జరిగిన కన్జర్వేటివ్‌ పొలిటికల్‌ యాక్షన కాన్ఫరెన్స్‌లో నిక్కీ హెలీ ప్రసంగిస్తూ.. ‘‘అమెరికన్లు తల ఎత్తి ఆకాశం వైపు చూస్తే.. చైనా నిఘా బెలూన్లు ఆకాశంలోంచి మనల్ని చూస్తూ ఉంటాయని నా జీవితంలో ఎన్నడూ అనుకోలేదు. ఇది అవమానకరం’’ అని వ్యాఖ్యానించారు.

కరోనా తదితర అంశాలపై చైనాను జవాబుదారీగా ఉంచాలన్నారు. అంతేకాకుండా ” అమెరికాలోని వేలాది ఎకరాలలో చైనా కంపెనీలు విస్తరించి ఉన్నాయి. వాటిలో కొన్ని మన సైనిక స్థావరాల పక్కన ఉన్నాయి. శత్రువులు మన దేశంలో భూమిని కొనేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. అలాగే ప్రతి విశ్వవిద్యాలయానికి ఒక విషయం స్పష్టం చేయాలి. మీకు చైనా నిధులు కావాలా? లేక అమెరికా ప్రభుత్వం ఇచ్చే నిధులు కావాలా? మీరు ఇకపై రెండింటినీ పొందలేరు అని తేల్చిచెప్పాలి” అని అన్నారు.

అమెరికా పని అయిపోయిందని చైనా భావిస్తోందని, అలా అనుకుంటే తప్పేనని నిక్కీ హెచ్చరించారు. అమెరికా విదేశాంగ విధానాలపై విమర్శలు చేసిన ఆమె.. అమెరికాను ద్వేషించే దేశాలకు సహాయం చేయకూడదన్నారు.

నిక్కీ హేలీ గతంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఫిబ్రవరి 14న ప్రకటించారు. ప్రస్తుతానికి బరిలో ఉన్న ఏకైక మహిళ నిక్కీనే. అయితే సొంత పార్టీకి చెందిన నేత, అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుంచి ఈమెకు గట్టిపోటీ ఎదురవుతోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Doctor Preethi | డాక్టర్‌ ప్రీతి కేసులో కీలక మలుపు.. లభించిన ఆధారం!

WPL 2023 | అవే సీన్స్‌ రిపీట్‌.. ఐపీఎల్‌ ఆరంభ పోరులో జరిగినట్లే ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌లోనూ జరిగాయి !

WPL 2023 | డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌కు అదిరిపోయే ఆరంభం.. బోణీ కొట్టిన ముంబై

Marriage | పెళ్లి కోసం వెరైటీ మేకప్ ట్రై చేసిన పెళ్లి కూతురు.. దడుసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు!

Manchu Manoj | సైలెంట్‌గా మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్‌

Saif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా బెడ్ రూమ్‌లోకి రండి అంటూ ఆగ్రహం!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News