Home Entertainment Namrata shirodkar | వాళ్ల వల్లే మహేశ్‌తో గొడవలు.. సితార అన్‌ప్లాన్‌డ్‌ బేబీ.. ఇంట్రెస్టింగ్‌ విషయాలు...

Namrata shirodkar | వాళ్ల వల్లే మహేశ్‌తో గొడవలు.. సితార అన్‌ప్లాన్‌డ్‌ బేబీ.. ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటపెట్టిన నమ్రత

Mahesh babu – Namrata shirodkar | టాలీవుడ్‌లో మోస్ట్ క్యూట్‌ కపుల్‌లో మహేశ్‌బాబు – నమ్రత జంట ఒకటి. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు గుడ్‌బై చెప్పేసి.. ఫ్యామిలీని చూసుకుంటుంది. మహేశ్‌ బాబు కూడా ఒకవైపు సినిమాలు చేస్తూనే ఫ్యామిలీకి కూడా కావాల్సినంత టైమ్‌ కేటాయిస్తుంటాడు. రెగ్యులర్‌గా టూర్స్‌కు వెళ్తుంటారు. సోషల్‌మీడియాలో తమ ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడూ పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకుంది.

వాళ్ల వల్లే మాకు గొడవలు

ముందు మోడలింగ్‌ చేసి.. అది బోర్‌ కొట్టడంతో సినిమాల్లోకి వచ్చానని.. అప్పుడే మహేశ్‌తో పరిచయం ఏర్పడిందని నమ్రత గుర్తుచేసుకుంది. కాబోయే భార్య ఎలా ఉండాలనే దానిపై మహేశ్‌కు ఒక క్లారిటీ ఉందని తెలిపింది. అందుకే సినిమాలకు దూరమయ్యానని వివరించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని.. అయితే తనకు నటించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఇక మహేశ్‌తో గొడవలు వస్తాయా లేదా అనే విషయంలో కూడా ఇంట్రెస్టింగ్‌ విషయాలను నమ్రత బయటపెట్టింది. సాధారణంగా తమ మధ్య ఎలాంటి గొడవలు రావని.. ఒకవేళ వచ్చినా అవి పిల్లల వల్లేనని అసలు విషయం చెప్పింది. పిల్లలు ఏది అడిగినా మహేశ్‌ కాదనడని.. తనేమో నో చెబుతుంటానని.. దీంతో ఇద్దరి మధ్య సరదాగా వాదనలు జరుగుతాయని చెప్పింది.

సితార అన్‌ప్లాన్‌డ్ బేబీ

మహేశ్‌ను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో హ్యాపీ ముమెంట్ అని నమ్రత చెప్పింది. గౌతమ్‌ పుట్టిన సమయంలో చాలా క్రిటికల్‌ సిచ్యుయేషన్స్‌తో ఎదుర్కొన్నట్టు తెలిపింది. ఎనిమిదో నెలలోనే గౌతమ్‌ పుట్టడంతో బతుకుతాడో లేదో అని డాక్టర్లు చెప్పడంతో చాలా టెన్షన్‌ పడ్డామని ఎమోషన్‌ అయ్యింది. ఇక తన కూతురు సితార అన్‌ప్లాన్‌డ్‌ బేబీ అని చెప్పి షాకిచ్చింది నమ్రత. ఒకవేళ సితార పుట్టి ఉండకపోతే తమ జీవితాలు అసంపూర్ణంగానే ఉండేవేమోనని పేర్కొంది. తను వచ్చాక తమ జీవితమే మారిపోయిందని తెలిపింది. తనపట్ల మహేశ్‌ చాలా సంతోషంగా ఉంటారని చెప్పింది.

మిలీనియం మొదట్లో 2000వ సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమాలో మహేశ్‌, నమ్రత కలిసి నటించారు. ఆ సినిమా టైమ్‌లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి 2005లో పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Sundeep kishan – rejina cassandra | సందీప్ కిషన్‌తో రెజీనా ప్రేమాయణం.. టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన పోస్టు..

Dil Raju | వారసుడు సినిమాకు విజయ్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ కాదంట.. టాలీవుడ్‌ హీరోలు మిస్‌ చేసుకోవడంతో ఆఫర్‌ పట్టేశాడు

Atlee kumar | పెళ్లయిన 8 ఏళ్లకు తల్లిదండ్రులు అవుతున్న మరో సెలబ్రెటీ కపుల్‌

Exit mobile version