Home Entertainment Ramya | అప్పుడు సమంత.. ఇప్పుడు దీపిక.. కావాలనే ట్రోల్స్‌ చేస్తున్నారు.. మండిపడ్డ హీరోయిన్‌

Ramya | అప్పుడు సమంత.. ఇప్పుడు దీపిక.. కావాలనే ట్రోల్స్‌ చేస్తున్నారు.. మండిపడ్డ హీరోయిన్‌

Ramya | రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్‌. షారుక్‌ఖాన్‌ హీరోగా వస్తున్న పఠాన్‌ సినిమాలో బేషరమ్‌ రంగ్‌ పాటలో దీపికా పదుకుణె వేసిన బికినీపై విపరీతమైన ట్రోల్స్‌ వస్తున్నాయి. దీనికి కొంతమంది మతతత్వ రంగు పులుముతూ రాజకీయం చేస్తుంటే.. మరికొందరు దీపికా పడుకునేపై విమర్శలు చేస్తున్నారు. ఇలా రోజురోజుకీ బేషరమ్‌ రంగ్‌ సాంగ్‌ వివాదం ముదురుతుండటంపై కన్నడ నటి, లోక్‌ సభ మాజీ ఎంపీ రమ్య అలియాస్‌ దివ్య స్పందన స్పందించారు. స్త్రీ వ్యతిరేకత కారణంగానే ఇప్పుడు దీపిక పడుకుణెపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే అప్పుడు సమంతను.. ఇప్పుడు దీపికను ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు.

విడాకులు తీసుకుందనే కారణంతో అప్పట్లో సమంతను ట్రోల్‌ చేశారని రమ్య గుర్తు చేశారు. తన అభిప్రాయం తెలిపినందుకు సాయిపల్లవిని, ఓ నటుడితో విడిపోయినందుకు రష్మికను.. కురచ దుస్తులు వేసుకుందని ఇప్పుడు దీపికను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు సమంత, ఇప్పుడు దీపిక ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహిళలు చిన్న చిన్న కారణాలకే విమర్శలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టమైన వాటిని ఎంచుకునే స్వతంత్రం మనకు ఉంది.. దుర్గాదేవి ప్రతిరూపాలే మహిళలు.. స్త్రీ ద్వేషం అనే రాక్షసుడిపై పోరాటం చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి ఎంతో ఉందని రమ్య తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

పలు కన్నడ చిత్రాల్లో నటించని రమ్య.. నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన అభిమన్యుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. కానీ ఆ సినిమా సక్సెస్‌ కాకపోవడంతో మళ్లీ శాండిల్‌వుడ్‌కే పరిమితమైంది. మధ్యమధ్యలో తమిళ చిత్రాల్లోనూ మెరిసింది. సూర్య హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తెరకెక్కించిన సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే 2012లో రమ్య.. కాంగ్రెస్‌లో చేరింది. 2013 ఉప ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య నుంచి ఎంపీగా ఎన్నికైంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రమ్య.. ప్రతిపక్షాలకు కౌంటర్స్‌ ఇస్తూ ఉంటుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Sundeep kishan – rejina cassandra | సందీప్ కిషన్‌తో రెజీనా ప్రేమాయణం.. టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన పోస్టు..

Dil Raju | వారసుడు సినిమాకు విజయ్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ కాదంట.. టాలీవుడ్‌ హీరోలు మిస్‌ చేసుకోవడంతో ఆఫర్‌ పట్టేశాడు

Atlee kumar | పెళ్లయిన 8 ఏళ్లకు తల్లిదండ్రులు అవుతున్న మరో సెలబ్రెటీ కపుల్‌

Exit mobile version