Home Lifestyle Do you know Household tips | యాపిల్‌ను కోసినప్పుడు రంగు మారిపోతుందా?

Household tips | యాపిల్‌ను కోసినప్పుడు రంగు మారిపోతుందా?

Household tips | యాపిల్‌ను కోసినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కానీ కోసిన కొద్దిసేపటికే అవి నల్లగా మారిపోతుంటాయి. ఇలా నల్లగా మారడానికి కారణం ఆక్సిడేషన్‌ ప్రక్రియ. గాలితో చర్య జరపడం వల్ల యాపిల్‌ ముక్కలు నల్లగా మారిపోతాయి. యాపిల్స్‌ అనే కాదు ఇంకా చాలా పండ్లు కూరగాయలు కోయగానే రంగు మారిపోతుంటాయి. పైగా రుచిని కూడా కోల్పోతుంటాయి. మరి ఇలా రంగు మారకుండా చాలాసేపటి వరకు ఫ్రెష్‌గా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యాపిల్‌ను కోసిన తర్వాత రంగు మారద్దంటే.. దాన్ని కోసేటప్పుడు నల్లా నీటి కింద ఉంచాలి. ఆ నీటి కింద యాపిల్‌ను కోసినట్లయితే ఆక్సిడేషన్‌ ప్రక్రియను ఆపవచ్చు. దీనివల్ల పండ్లు రంగు మారవు.

➣ యాపిల్స్‌ అనే కావు ఏ పండ్లు కోసినప్పుడు అయినా సరే రంగు మారద్దంటే ఒక గిన్నెలో అల్లం ద్రావణం తీసుకోవాలి. అల్లంలో ఉండే సెట్రిక్‌ యాసిడ్‌లో ఆక్సిడేషన్‌ ప్రక్రియను నిలిపివేసే గుణం ఉంది. కాబట్టి కోసిన పండ్ల ముక్కలను ఆ ద్రావణంలో వేస్తే రంగు మారవు.

➣ వంకాయలను కోసేటప్పడు ఆ ముక్కల్ని ఉప్పు నీటిలో వేస్తే రంగు మారకుండా ఉంటాయి. పండ్లు కోసేటప్పుడు కూడా ఉప్పు నీటిలో కాసేపు ఉంచి తీస్తే రంగు మారకుండా ఫ్రెష్‌గా ఉంటాయి.

➣ గోరువెచ్చటి నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. అందులో పండ్ల ముక్కలను వేసి 30 సెకన్ల పాటు ఉంచాలి. ఆ తర్వాత తీస్తే పండ్ల ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.

➣ ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలపాలి. అనంతరం అందులో పండ్ల ముక్కలను వేసి కలిపితే పండ్ల ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. నిమ్మకాయ లేకపోతే ఫైనాపిల్‌, ఆరెంజ్‌ జ్యూస్‌ కూడా కలపవచ్చు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Most dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ పాము.. ఇది కాటేస్తే 100 మంది బలికావాల్సిందే

Roanoke mystery | ఊరుకు ఊరే మాయమైంది.. అక్కడి జనం ఏమైపోయారో ఇప్పటికీ మిస్టరీనే !!

How to wash silk sarees | పట్టుబట్టలపై మరకలు పడ్డాయా? ఈ చిట్కాలతో సులువుగా పోగొట్టుకోండి

Exit mobile version