Home Entertainment Sundeep kishan – rejina cassandra | సందీప్ కిషన్‌తో రెజీనా ప్రేమాయణం.. టాలీవుడ్‌లో వైరల్‌గా...

Sundeep kishan – rejina cassandra | సందీప్ కిషన్‌తో రెజీనా ప్రేమాయణం.. టాలీవుడ్‌లో వైరల్‌గా మారిన పోస్టు..

Sundeep kishan – rejina cassandra | యువ నటుడు సందీప్‌ కిషన్‌, రెజీనా డేటింగ్ విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. సందీప్‌ కిషన్‌ చేసిన ఒక పోస్టు కారణంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

శివ మనసులో శృతి (ఎస్‌ఎంఎస్‌) సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రెజీనా ఇక్కడ చాలా సినిమాలే చేసింది. ఇక సందీప్‌ కిషన్‌తో నాలుగు సినిమాలు చేసింది. వీళ్లిద్దరూ కలిసి రొటీన్‌ లవ్‌ స్టోరీ, రారా కృష్ణయ్య, మానగరం, నక్షత్రం సినిమాల్లో నటించారు. దీంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అప్పుప్పుడు వీళ్లు కలుస్తుంటారు కూడా. ఈ క్రమంలోనే సందీప్‌ కిషన్‌తో రెజీనా డేటింగ్‌లో ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అవి మధ్యలో ఆగిపోయాయి. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌తో రెజీనా ప్రేమలో ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలపై అటు రెజీనా, ఇటు మెగా ఫ్యామిలీ ఎవరూ స్పందించలేదు. దీంతో ఈ వార్తలు పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇలాంటి సమయంలో సందీప్‌ కిషన్‌ చేసిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.

రెజీనా పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్‌ 13న సందీప్‌ కిషన్‌ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పడంతో డేటింగ్‌ వార్తలు గుప్పుమన్నాయి. రెజీనా, సందీప్‌ కిషన్‌ మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఉందని అందరికీ తెలుసు కాబట్టి నార్మల్‌గా మెసేజ్‌ విష్‌ చేస్తే ఎవరూ సందేహించే వాళ్లు కాదు. కానీ సందీప్‌ కిషన్‌ విష్‌ చేసిన స్టైల్‌ వాళ్లిద్దరి మధ్య ఉన్న చనువును బయటపెడుతోంది. హ్యాపీ బర్త్‌ డే పాప.. లవ్‌ యూ నీకు అన్ని విషయాల్లో మంచే జరగాలని కోరుకుంటున్నా. స్టే హ్యాపీ.. స్టే బ్లెస్‌డ్‌ అంటూ సందీప్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో పాటు ఆమెతో క్లోజ్‌గా ఉన్న ఒక సెల్ఫీని షేర్‌ చేశాడు. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ అప్పట్లో వచ్చిన వార్తలన్నీ నిజమేనని నెటిజన్లు ఫిక్సయిపోయారు. ఇప్పుడు సోషల్‌ మీడియా అంతా వీళ్ల ప్రేమాయణం గురించే చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తలపై సందీప్‌ కిషన్‌, రెజీనా స్పందిస్తారా? లేదా సైలెంట్‌గా ఉండిపోతారా చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Manchu Manoj | భూమా మౌనికతో త్వరలోనే పెళ్లి? మంచు మనోజ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

Pawan kalyan – Ali | గ్యాప్ రాలేదు.. క్రియేట్ చేశారు.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్‌పై అలీ ఓపెన్ కామెంట్స్

Top 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఈ హీరోయిన్‌ గురించే..

Exit mobile version