Saturday, April 27, 2024
- Advertisment -
HomeEntertainmentChiranjeevi | మాది సినిమా కులం.. సినీ కార్మికులను తలచుకుని మరోసారి ఎమోషనల్ అయిన చిరంజీవి

Chiranjeevi | మాది సినిమా కులం.. సినీ కార్మికులను తలచుకుని మరోసారి ఎమోషనల్ అయిన చిరంజీవి

Chiranjeevi | చాలారోజుల తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తర్వాత వచ్చిన గాడ్‌ఫాదర్ ఫర్వాలేదు అనిపించింది.. కానీ వాల్తేరు వీరయ్య మాత్రం మెగా ఫ్యాన్స్‌ను పూనకాలు తెప్పించింది. వింటేజ్ చిరంజీవి కనిపిస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ రెస్పాన్స్ చూసి చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న చిరంజీవి.. ఈ విజయం వెనుక తనొక్కడిదే కాదు.. సినీ కార్మికులు అందరి కష్టం ఉందని తెలిపాడు. ఈ విజయం వాళ్లందరికీ చెందాలని పేర్కొన్నాడు. తాజాగా మరోసారి ఎమోషన్ అయ్యాడు. సినీ కార్మికులు తలచుకుంటే చేయలేనిది ఏమీ లేదని ప్రశంసలు కురిపించారు. సినీ కార్మికుల కష్టాన్ని వివరిస్తూ ఓ స్పెషల్ మీడియోను షేర్ చేశాడు.

” మా గమ్యం.. మిమ్మల్ని అలరించడం.. ఎండ మండుతున్నా.. వాన కురుస్తున్నా.. చలి వణికిస్తున్నా.. మంచు కురుస్తున్నా ముందుకు అడుగేయడమే మాకు తెలుసు. కొండల్ని ఎక్కుతాం.. లోయల్ని దాటుతాం.. వాగుల్లో నడుస్తాం.. అడవుల్లో సేదతీరుతాం.. ఎంత కష్టమైనా చేస్తాం.. మా గమ్యం మిమ్మల్ని అలరించడం. మేం చేయలేని ఏమీ లేదు. అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తాం.. ఆకాశానికి నిచ్చెనలు వేయగలం.. సముద్రానికి వారథులు కట్టగలం.. ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తాం.. మా గమ్యం మిమ్మల్ని అలరించడం..

నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటాం.. కట్టుకున్న వాళ్లు గుర్తొచ్చి దిగులు అనిపించినా.. కన్నబిడ్డలు గుర్తొచ్చి గుండె బరువెక్కినా.. పైకి కనబడకుండా నిబ్బరంగా నటిస్తాం. శ్రమిస్తాం.. ఎంత కష్టమైనా అలరిస్తాం.. మా గమ్యం ఒక్కటే.. మిమ్మల్ని అలరించడం.. మేమంతా సినీ కార్మికులం.. నిరంతర శ్రామికులం. కథకు బానిసలం.. కళామతల్లి సైనికులం.. మేమంతా సినిమా ప్రేమికులం.. సినిమానే మా కులం.. సినిమానే మా శ్వాస.. సినిమానే మా గమ్యం.. మా గమ్యం మీ అందర్నీ అలరించడం.. ఇంతటి అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి సినీ కార్మికుడికి మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. థ్యాంక్యూ..మీ అకుంటిత కృషే వాల్తేరు వీరయ్య విజయానికి కారణం. ” అంటూ ఆ వీడియోలో చిరంజీవి ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?

Jayasudha | అమెరికన్ బిజినెస్‌మ్యాన్‌తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News