Friday, April 19, 2024
- Advertisment -
HomeEntertainmentVeerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్...

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

సీనియర్ హీరోల గ్రాఫ్ చూసుకుంటే ప్రస్తుతం నందమూరి బాల‌కృష్ణ గ్రాఫ్ పీక్స్ లో ఉంది. ఆ మధ్య కాస్త డల్ అయినట్లు కనిపించినా అఖండతో తిరుగులేని విజయాన్ని సాధించాడు. అంతేకాకుండా అప్పటివరకు ఉన్న మార్కెట్ ను రెండింతలు పెంచుకున్నాడు. ఇక ఇటీవల అన్ స్టాపబుల్ టాక్ షోతో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇలా కెరీర్ మంచి స్పీడ్లో ఉన్నప్పుడు క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన గోపిచంద్ తో చేతులు కలిపాడు. టాలీవుడ్ లో బోయపాటి తర్వాత అలాంటి మాస్ సినిమాలు గోపిచంద్ మాత్రమే తీస్తాడని ఆ మధ్యన పేరు కూడా తెచ్చుకున్నాడు. అలాంటి మాస్ డైరెక్టర్ తో చేతులు కలపడంతో ప్రేక్షకులలో ఓ రేంజ్ లో అంచనాలు నమోదయ్యాయి. దానికి తగ్గట్లే టైటిల్, పోస్టర్, ట్రైలర్ ఇలా చిత్రబృందం రిలీజ్ చేసిన ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి.

Veera Simha Reddy

ఇక సంక్రాంతి సినిమాలన్నిటిలో విపరీతమైన బజ్ తో రిలీజైన సినిమా ఇదొక్కటే. అంతేకాకుండా ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో రిలీజైంది. భారీ అంచనాల నడుమ గురువారం రిలీజైన ఈ సినిమా మొదటి షో నుండి మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ ఆ ప్రభావం వసూళ్లపై ఏమాత్రం పడలేదు. మొదటి రోజు ఏకంగా రూ.54 కోట్ల గ్రాస్ సాధించి బాలకృష్ణ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. బాలయ్య కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా వీరసింహా రెడ్డి నిలిచింది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట తర్వాత అత్యధికంగా డే1 కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా వీరసింహా రెడ్డి నిలిచింది. మొదటి రోజే దాదాపు 35శాతం బడ్జెట్ రికవరీ అయింది. ఇక శుక్రవారం కూడా బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.

veerasimha reddy

కాగా శుక్రవారం ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కావడంతో కాస్త థియేటర్ల కొరత ఏర్పడింది. ఇక శనివారం వారసుడు రిలీజ్ కానుంది. దిల్ రాజు గుప్పట్లో ఉన్న థియేటర్లన్నిటిలో వారసుడు బొమ్మే పడుతుంది. దాంతో వీరసింహాకు థియేటర్ల సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. ఈ క్రమంలో మొదటి రోజుతో పోల్చితే కలెక్షన్ల సంఖ్య సగం వరకు తగ్గే చాన్స్ ఉంది. దానికి తోడు కాస్త డివైడ్ టాక్ రావడంతో వీరసింహుడు పరిస్థితి అటు ఇటుగా ఉంది. అయితే బాలయ్య సినిమాలకు టాక్ తో సంబంధంలేకుండా, కేవలం ఆయన ఫైట్స్, డైలాగ్స్ చూడటానికే ఒక సెక్షన్ ఆడియెన్స్ థియేటర్లకు వస్తుంటారు. అలా వచ్చినా సరే బాలయ్య ఈ సంక్రాంతికి గట్లు ఎక్కినట్లే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Shruti Haasan | నా జ్వరం కాస్త మానసిక సమస్యగా మారిందన్నమాట.. అనారోగ్య వార్తలపై స్పందించిన శ్రుతిహాసన్‌.

Saipallavi | సాయిపల్లవికి ఏమైంది.. ఛాన్సులు రావడం లేదా? తనే ఒప్పుకోవడం లేదా?

Waltair Veerayya | వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీకి వచ్చేది అప్పుడే..

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Aishwarya lekshmi | విలన్‌తో ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో ఉందా? ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుకు అర్థమేంటి?

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

Upasana Konidela | పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్ అయిన ఉపాసన.. ట్వీట్ వైరల్

Srinidhi shetty | కేజీఎఫ్ బ్యూటీకి టాలీవుడ్ నుండి భారీ ఆఫర్.. ఇక్కడైనా అదృష్టం కలిసి వస్తుందా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News