Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentKushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?

Kushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?

Kushboo in Vaarisu | మొత్తానికి వారసుడు సినిమా తెలుగులో రిలీజైంది. తమిళ వర్షన్ వారిసు ఇప్పటికే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కానీ తెలుగులోనే మూడు రోజులు ఆలస్యంగా వచ్చింది. సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు వస్తుండటంతో దిల్ రాజు తన సినిమాను కాస్త ఆలస్యంగా తీసుకొచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా శనివారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమాలోని ఓ క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

ఎవరి క్యారెక్టర్ గురించి అని అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా కుష్బూ గురించే. వారిసు సినిమాలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. దీనిగురించి ప్రొడక్షన్ టీమ్ అధికారికంగా చెప్పాల్సి ఉంది అంటూ విజయ్, రష్మికతో షూటింగ్ సెట్‌లో దిగిన ఒక ఫొటోను అప్పట్లో కుష్బూ పోస్టు చేసింది. దీంతో వారిసులో విజయ్ తల్లిగా కుష్బూ నటిస్తుందని అంతా ఫిక్సయిపోయారు. తీరా సినిమా విడుదలయ్యాక వెళ్లి చూస్తే.. ఎక్కడా కుష్బూ కనిపించలేదు. దీంతో అంతా షాకయ్యారు. తెలుగులో కంటే తమిళంలో కుష్బూకు క్రేజ్ ఎక్కువగా ఉంది. అప్పట్లో తమిళనాట ఆమెకు గుడి కూడా కట్టారంటే అక్కడ ఆమెకు ఎంతో ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. జనవరి 11న విడుదలైన వారిసు సినిమాలో కుష్బూ లేకపోవడంతో వాళ్లు ఈ చర్చకు తెరలేపారు. దీంతో అసలు కుష్బూ‌ను సినిమా నుంచి ఎందుకు తప్పించారని అంతా సందిగ్ధంలో పడిపోయారు.

కుష్బూ నటించిన సీన్స్‌ను ఎడిటింగ్‌లో తీసేశారా? లేదా కుష్బూను తప్పించి ఆమె పాత్రలో జయసుధను తీసుకున్నారా? అని చర్చ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, దీనిపై మరో వాదన వినిపిస్తుంది. రిసులో భాగం కావడంపై ఇంకా ఏదైనా చెప్పాలంటే ప్రొడక్షన్ టీమ్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉందని అని అప్పట్లో కుష్బూ ట్వీట్ చేసింది. అంటే తనను కేవలం ఆప్షన్‌గా మాత్రమే తీసుకున్నారని కుష్బూకు కూడా తెలుసని పలువురు అభిప్రాయపడుతున్నారు. చివరి నిమిషంలో కుష్బూకు బదులు జయసుధను ఫైనల్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఏదేమైనా వారసుడు టీమ్ చెబితే గానీ దీనిపై ఓ క్లారిటీ రాదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

Shruti Haasan | నా జ్వరం కాస్త మానసిక సమస్యగా మారిందన్నమాట.. అనారోగ్య వార్తలపై స్పందించిన శ్రుతిహాసన్‌.

Saipallavi | సాయిపల్లవికి ఏమైంది.. ఛాన్సులు రావడం లేదా? తనే ఒప్పుకోవడం లేదా?

Waltair Veerayya | వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీకి వచ్చేది అప్పుడే..

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News