Sunday, March 26, 2023
- Advertisment -
HomeLatest NewsAxar Patel | కేఎల్ రాహుల్‌తో పాటు పెళ్లి చేసుకోబోతున్న మరో టీమిండియా క్రికెటర్.. అక్షర్...

Axar Patel | కేఎల్ రాహుల్‌తో పాటు పెళ్లి చేసుకోబోతున్న మరో టీమిండియా క్రికెటర్.. అక్షర్ పటేల్ కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

Axar Patel | టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు మేహా పటేల్‌తో కలిసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. వీరిద్దరి పెళ్లి ఈ నెలలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌ నుంచి అక్షర్ పటేల్‌కు బీసీసీఐ విశ్రాంతి కల్పించినట్లు సమాచారం. కుటుంబ కారణాల వల్లనే అక్షర్ పటేల్ కివీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండట్లేదని జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ తెలిపింది. కానీ పెళ్లి విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

మేహా పటేల్‌తో అక్షర్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా జనవరి 20న మేహాకు అక్షర్ పటేల్ రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. మేహా కూడా యాక్సెప్ట్ చేయడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తమ ఫొటోలను షేర్ చేశాడు. అక్షర్ పటేల్ ప్రియురాలు మేహా విషయానికొస్తే ఆమె న్యూట్రిషనిస్ట్. వృత్తిరీత్యా డైటీషియన్ కావడంతో అక్షర్ పటేల్ డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వీళ్లిద్దరికీ ట్రావెలింగ్ అంటే ఇష్టం. మేహా పటేల్ తన చేతి మీద AKSH అని టాటూ కూడా వేయించుకుంది. వీళ్లిద్దరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించడంతో అక్షర్, మేహా పటేల్ పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. కొద్దిమంది బంధువుల సమక్షంలోనే పెళ్లి చేసుకుని అనంతరం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని అక్షర్ పటేల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు పెళ్లి తేదీని ప్రకటించలేదని సమాచారం.

అక్షర్ పటేల్‌తో పాటు మరో స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన ప్రేయసి బాలీవుడ్ నటి, సునీల్ శెట్టి కూతురు అయిన అథియా శెట్టిని జనవరి 23న వివాహం చేసుకోనున్నాడు. కన్నడ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Women’s Under 19 T20 World Cup | మహిళల అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ విజయం.. దంచికొట్టిన ఓపెనర్లు

Uppal Stadium | హైదరాబాద్ చేరుకున్న న్యూజీలాండ్ జట్టు.. ఈనెల 18న ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్

Womens T20 World Cup | అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు వేళాయే.. తొలిపోరులో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీ .. జట్టులో భద్రాచలం అమ్మాయి

Hockey World Cup | ఆరంభం అదుర్స్‌.. స్పెయిన్‌పై భారత్‌ ఘనవిజయం.. హాకీ ప్రపంచకప్‌

KL Rahul | దేనికైనా రెడీ.. ఐదోస్థానంలో బ్యాటింగ్‌పై కేఎల్ రాహుల్‌ స్పందన

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News