Sunday, March 26, 2023
- Advertisment -
HomeLatest NewsTelangana secretariat | సీఎం కేసీఆర్ బర్త్ డే నాడే తెలంగాణ సెక్రటేరియట్ ఓపెనింగ్.. ...

Telangana secretariat | సీఎం కేసీఆర్ బర్త్ డే నాడే తెలంగాణ సెక్రటేరియట్ ఓపెనింగ్.. మంత్రి వేముల వెల్లడి

Telangana secretariat | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న కొత్త సెక్రటేరియట్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.

20 ఎకరాల సువిశాలమైన స్థలంలో కొత్త సచివాలయం నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. రూ.617 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌ ఉపయోగించి సుమారు 200 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా దీన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రివర్గ సమావేశ మందిరం, పెద్ద హాలు ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేడర్క్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టారు.

కొత్త సచివాలయానికి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి. అందులో ప్రధాన ద్వారం తూర్పు దిశలో లుంబినీ పార్కు ఎదురుగా నిర్మిస్తున్నారు. తెలంగాణ రాకముందు కూడా ఇక్కడే ప్రధాన ద్వారం నిర్మిస్తున్నారు. సీఎం కాన్వాయ్ ఇందులో నుంచి సెక్రటేరియట్‌లోకి వెళ్తుంది. ఎన్టీఆర్ గార్డెణ్ వైపు ఉన్న ద్వారం ఉద్యోగులు రావడానికి వాడతారు. బిర్లామందిర్ వైపు రోడ్డులో ఉన్న పౌరసరఫరాల శాఖ పెట్రోల్ బంక్‌ను తొలగించి.. అక్కడ సందర్శకుల కోసం మరో గేటు ఏర్పాటు చేశారు. వాస్తు పరంగా మూడు ద్వారాలు ఉండకూడదనే ఉద్దేశంతో భవనం వెనుక వైపు మింట్ దిశలో నాలుగో ద్వారాన్ని నిర్మించారు. ఇది ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే వాడతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nepal plane crash | రన్ వేపై కుప్పకూలిన విమానం.. ప్లేన్‌లో 68 మంది ప్రయాణికులు

Vande Bharat Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడవనున్న రైలు

Ban on Gas stoves | చిన్న పిల్లల్లో పెరుగుతున్న అస్తమా.. గ్యాస్ స్టౌవ్ బ్యాన్ చేసే యోచనలో అమెరికా?

Miss Universe 2022 | మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న బొన్నీ గాబ్రియెల్.. 11 ఏళ్ల తర్వాత అమెరికాకు కిరీటం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News