Saturday, May 4, 2024
- Advertisment -
HomeNewsInternationalMessi | ‘మెస్సీ.. నీ కోసం ఎదురుచూస్తున్నాం’.. సాకర్ స్టార్‌కు అగంతకుల బెదిరింపు.. గాల్లోకి 12...

Messi | ‘మెస్సీ.. నీ కోసం ఎదురుచూస్తున్నాం’.. సాకర్ స్టార్‌కు అగంతకుల బెదిరింపు.. గాల్లోకి 12 రౌండ్ల కాల్పులు

Messi | టైమ్ 2 న్యూస్, బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా సాకర్ దిగ్గజం.. ప్రపంచ కప్ విజేత లియోనెల్ మెస్సిని లక్ష్యంగా చేసుకొని కొందరు అగంతకులు బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనకు అర్జెంటీనాలోని రోసారియో నగరం వేదికైంది రోసారియోలో మెస్సీ భార్య అంటోనెల్లా కుటుంబ సభ్యులు ఒక సూపర్ మార్కెట్ నిర్వహిస్తుండగా.. అందులోకి దూరిన కొందరు దుండగులు అర్ధరాత్రి పూట కాల్పులకు తెగబడ్డారు. ఈ అంశాన్ని రోసారియో పోలీసులు ధ్రువీకరించారు. కాల్పుల అనంతరం అగంతకులు.. ‘మెస్సీ.. నీ కోసం ఎదురుచూస్తున్నాం’ అని రాయడం మరింత కలవరపాటుకు గురిచేసింది. దీంతో పాటు నగర మేయర్ పాబ్లో జావ్కిన్ ఓ మాదకద్రవ్యాల డీలర్.. అని అతడు మిమ్మల్ని కాపాడలేడని కూడా అగంతకులు పేర్కొన్నారు. దీంతో విషయం తెలిసుకున్న రోసారియో మేయర్ జావ్కిన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం మేయర్ మాట్లాడుతూ.. స్థానికంగా అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నామన్నారు. మెస్సీ పేరు వాడుకుంటే.. ఆ వార్త ప్రపంచంలో ధావానంలా పాకుతుందనే ఉద్దేశంతోనే అతడిని ఇందులోకి లాగా ఉంటారని అన్నారు. ఇది ఈ ఒక్కరోజు జరిగిన ఘటన కాదని.. గత కొంత కాలంగా ఇలాంటివి జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని ఆకర్శించేందుకే మెస్సీని ఈ అంశంలోకి లాగినట్లు పోలీసులు కూడా ధ్రువీకరించారు. 12 రౌండ్లు వరకు కాల్పులు జరిపారని.. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లలేదని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు గతేడాతి ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్తో జరిగిన హోరాహోరీ ఫైనల్లో రెండు అద్వితీయ గోల్స్ చేసిన మెస్సీ మూడోసారి అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించాడు. ప్రపంచకప్తోనే కెరీర్కు వీడ్కోలు పలకాలని ముందు భావించిన మెస్సీ.. చాంపియన్గా నిలిచిన అనంతరం ఇంకొన్నాళ్లు ఫుట్బాల్ ఆడుతునని ప్రకటించాడు. ప్రస్తతుం జగజ్జేత హోదా అనుభవిస్తున్న మెస్సీ.. పారిస్ లీగ్ కోసం సిద్ధమవుతున్నాడు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News