Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentAtlee | తండ్రి అయిన స్టార్‌ డైరెక్టర్‌.. పెళ్లయిన 8 ఏళ్లకు ప్రమోషన్‌

Atlee | తండ్రి అయిన స్టార్‌ డైరెక్టర్‌.. పెళ్లయిన 8 ఏళ్లకు ప్రమోషన్‌

Atlee kumar | తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ కుమార్‌ తండ్రి అయ్యాడు. పెళ్లయిన దాదాపు ఎనిమిదేళ్లకు అట్లీ భార్య, నటి ప్రియా మోహన్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అట్లీ ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.

‘ వాళ్లు చెప్పింది నిజమే. దీనికి మించిన ఆనందం ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఉండదు. మాకు బాబు పుట్టాడు. తల్లిదండ్రులుగా ఈరోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. దీనికి మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు కావాలి ‘ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. దీనికి ఓ వీడియోను కూడా యాడ్‌ చేశాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు అట్లీ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

డైరెక్టర్‌ అట్లీ కుమార్, నటి ప్రియా మోహన్‌ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2014లో వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు కావడంతో తెగ సంబరపడిపోతున్నారు. ఇక అట్లీ కెరీర్‌ విషయానికొస్తే ఆర్య, నయనతార, నజ్రియా నజీమ్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన రాజా రాణి సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. ఫస్ట్‌ సినిమాతోనే సంచలన హిట్‌ అందుకున్నాడు. ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో తలపతి విజయ్‌కు దగ్గరయ్యాడు. ఆయనతో థెరీ, మెర్సల్‌, బిగిల్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది.

ప్రస్తుతం బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ఖాన్‌తో అట్లీ జవాన్‌ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్‌లో పాగా వేయాలని చూస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజై మంచి రెస్పాన్స్‌ అందుకుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nayanthara | నన్ను కూడా కమిట్‌మెంట్ అడిగారు.. సంచలన విషయం బయటపెట్టిన నయనతార

Jabardasth | జబర్దస్త్ నుంచి సింగర్ మనో ఎందుకు తప్పుకున్నాడు? కారణమేంటి?

Keerthy Suresh | మహానటి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. అసలు నిజమేనని చెప్పేసిన కీర్తి సురేశ్ తల్లి

Ileana | ఆస్పత్రి బెడ్‌పై ఇలియానా.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నానంటూ పోస్టు

Tarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News