Tuesday, April 16, 2024
- Advertisment -
HomeNewsAPTarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

Tarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తారకరత్నకు ఎకో సపోర్టు ఇవ్వడం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తున్నామని తెలిపారు.

తారకరత్న ఆరోగ్యంపై అతని బాబాయ్ నందమూరి రామకృష్ణ సోమవారం ఉదయం స్పందించారు. తారకరత్నను ఐసీయూలో చూసి వచ్చిన ఆయన మీడియాతో హెల్త్ అప్‌డేట్స్ పంచుకున్నాడు. నిన్న, మొన్నటితో పోలిస్తే తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని తెలిపాడు. అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయని చెప్పారు. వెంటిలేటర్‌పైనే ఉన్నారని చెప్పారు. అంతకుముందు మంచు మనోజ్ కూడా నందమూరి తారకరత్నను చూసి మీడియాతో మాట్లాడారు. తారకరత్న కోలుకుంటున్నాడని మంచు మనోజ్ తెలిపాడు. అతను తిరిగి వస్తాడని 100 శాతం విశ్వసిస్తున్నాడని చెప్పాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News